Thursday, May 1, 2025
HomeఆటWomen's T20 World Cup: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ విడుదల

Women’s T20 World Cup: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ విడుదల

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్(Women’s T20 World Cup) షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. వ‌చ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మెగాటోర్నీ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. జూలై 5న లండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత స్టేడియం లార్డ్స్‌లో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 24 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో 33 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. 12 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. లార్డ్స్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, లీడ్స్‌లోని హెడింగ్లీ, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్, లండ‌న్‌లోని ది ఓవల్, బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ మైదానాల్లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

- Advertisement -

భార‌త్‌, పాకిస్తాన్, శ్రీలంక‌, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు ఇప్ప‌టికే క్వాలిఫై అయ్యాయి. మ‌రో నాలుగు జట్లు క్వాలిఫ‌య‌ర్స్ ద్వారా ఎంపిక కానున్నాయి. మొత్తం 12 జ‌ట్ల‌ను రెండు గ్రూపులు విభ‌జిస్తారు. ఒక్కో గ్రూపులో ఆరు జ‌ట్లు ఉంటాయి. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా న్యూజిలాండ్ ఈ టోర్నీలో అడుగుపెట్ట‌నుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News