Saturday, November 15, 2025
HomeఆటWomen’s WC Final 2025: రేపే ఫైనల్ పోరు.. భారత్-సౌతాఫ్రికా హైవోల్టేజ్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?

Women’s WC Final 2025: రేపే ఫైనల్ పోరు.. భారత్-సౌతాఫ్రికా హైవోల్టేజ్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?

- Advertisement -

India vs South Africa, Women’s World Cup Final 2025: మహిళల ప్రపంచ కప్ 2025 తుది సమరం ఆదివారం జరగబోతుంది. ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. ఈ అద్భుతమైన పోరుకు నవంబర్ 2న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలిసారి ఇరు జట్లు టైటిల్ ను ముద్దాడాలని భావిస్తున్నాయి. సెమీఫైనల్లో టీమ్ ఇండియా బలమైన ఆస్ట్రేలియాను, దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌ను ఓడించింది. భారత్ మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోగా.. సౌతాఫ్రికా తొలిసారి ఆడబోతుంది.

టీమ్ ఇండియా లీగ్ దశలో మూడు మ్యాచుల్లో గెలిచి, మూడు మ్యాచుల్లో ఓడిపోయి సెమీస్ చేరింది టీమ్ ఇండియా. సెమీపైనల్లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. కంగూరు జట్టు విధించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని అద్భుతంగా ఛేదించి చరిత్ర సృష్టించింది. జెమిమా రోడ్రిగ్స్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు సౌతాఫ్రికా ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి పైనల్ కు చేరింది. ఈ ఫైనల్ పోరు నవంబరు 02న మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతుంది. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు వేస్తారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తోపాటు జియో హాట్ స్టార్ లో వీక్షించవచ్చు.

Also Read: IND vs AUS Highlights -IND vs AUS Highlights

స్క్వాడ్స్:

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చెత్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, క్రాంతి రెడ్డి.

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మారిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జాఫ్తా, నోన్‌కులులెకో మ్లాబా, అన్నరీ డెర్క్‌సెన్, అన్నెకే బోష్, మసబాటా క్లాస్, సునే లూస్, కరాబో మెసో, నో స్సెగౌక్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad