Saturday, November 15, 2025
HomeఆటJemimah Rodrigues: జెమిమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

Jemimah Rodrigues: జెమిమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

Jemimah Rodrigues: గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో జెమిమా అద్భుతమైన సెంచరీ చేసి ఒంటి చేత్తో టీమ్ ఇండియాను ఫైనల్ కు చేర్చింది. ఈమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.

ఒక్క మ్యాచ్ తో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంది జెమిమా జెస్సికా రోడ్రిగ్స్.
మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 లో భాగంగా గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసి భారత జట్టును ఫైనల్ కు చేర్చించింది జెమిమా.
134 బంతులు ఎదుర్కొన్న జెమిమా 14 ఫోర్లుతో 127 ప‌రుగుల‌ చేసి నాటౌట్ గా నిలిచింది. ఈమె వీరోచిత బ్యాటింగ్ కారణంగానే ఆస్ట్రేలియా విధించిన 339 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే ఛేదించింది.
ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు సౌతాఫ్రికాతో తలపడబోతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 02న న‌వీ ముంబైలో జరగనుంది.
జెమిమా జాతీయ జట్టుతోపాటు ముంబై తరుపున కూడా ఆడుతోంది. ఈమె అండర్-17 మహారాష్ట్ర హాకీ జట్టుకు కూడా ఆడింది.
2018లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad