Saturday, November 15, 2025
HomeTop StoriesWomens World Cup: వారంలోగా వన్డే ప్రపంచకప్.. భారత జట్టుకు బిగ్ షాక్..!

Womens World Cup: వారంలోగా వన్డే ప్రపంచకప్.. భారత జట్టుకు బిగ్ షాక్..!

Womens World Cup: మరోవారంలోగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్‌ మొదలైంది. అక్టోబర్ 30 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే, టోర్నమెంట్ ఆరంభానికి ముందే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో పేసర్ అరుంధతి రెడ్డికి తీవ్ర గాయమయ్యింది. ఇంగ్లాండ్ జరిగిన ఇన్నింగ్స్‌లో అరుంధతి 13వ ఓవర్‌ వేసింది. నాలుగో బంతికి స్ట్రైకింగ్‌లో ఉన్న హీథర్ నైట్‌ షాట్ కొట్టగా.. వేగంగా వచ్చిన బంతిని రిటర్న్‌ క్యాచ్‌ అందుకునేందుకు అరుంధతి ప్రయత్నించింది. ఈ క్రమంలో బంతి ఆమె ఎడమ కాలికి బలంగా తాకడంతో కిందపడిపోయింది. వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. ఫిజియోలు అరుంధతిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నొప్పితో విలవిల్లాడిన ఆమె నడవలేకపోయింది. దీంతో వీల్‌చైర్‌లో బయటకు తీసుకెళ్లారు. అరుంధతి రెడ్డి కోలుకోవడానికి ఎక్కువ సమయంపడితే స్టాండ్‌బైగా మరో పేసర్ సయాలీ సత్‌ఘరే జట్టులోకి వస్తుంది.

- Advertisement -

Read Also: Bigg Boss Today Promo: సేవ్ అయ్యో ఒక్క ఛాన్స్ పోయినట్టేనా.. ప్రియా ఎలిమినేషన్ తప్పదా?

భారత్- ఎ గెలుపు

ఇక, ప్రపంచకప్ వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో భారత్-ఎ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇసాబెల్లా (101) సెంచరీ చేయడంతో కివీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో షెఫాలీ వర్మ మెరుపులు మెరిపించింది. 49 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 70 పరుగులు చేసింది. షెఫాలీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ తో భారత్ 39.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది. ఆ తర్వాత వర్షం మొదలవడంతో ఆటను నిలిపివేశారు. డక్‌వర్త్‌ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 224గా నిర్దేశించారు. అప్పటికే టార్గెట్‌ను పూర్తి చేయడంతో భారత్‌-ఎను విజేతగా ప్రకటించారు.

Read Also: Bigg Boss Wildcard Entries: వెల్డ్ కార్డ్ ఎంట్రీలకు రంగం సిద్ధం.. ఆ ముగ్గురికే ఛాన్స్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad