Women’s World Cup: క్రికెట్ వరల్డ్ కప్ అంటేనే క్రేజ్ వేరు. మెన్స్ ఆర్ విమెన్స్ ఏదైనా వరల్డ్ కప్ అంటేనే వచ్చే మజా వేరు. ఎన్ని సిరీస్‌ల్లో అద్భుత విజయాలు సాధించినా.. మరెన్నో ట్రోఫీలు సాధించినా నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో ఒక్కసారైనా విశ్వవిజేతగా నిలవాలని అన్ని జట్లు తహతహలాడుతుంటాయి. అయితే, ఆ భాగ్యం ఒక్క టీమ్ కే దక్కుతుంది. ఇప్పుడు, ఆ అద్భుతమైన ఛాన్స్ టీమిండియాకు వచ్చింది. నెలరోజులపాటు సాగిన మహిళల వన్డే ప్రపంచ కప్ తుది అంకానికి చేరింది. ఆదివారం ముంబై వేదికగా టైటిల్ పోరులో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.
ఇప్పటివరకు 12 సార్లు..
ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచ కప్ 12 సార్లు జరగ్గా.. ఆస్ట్రేలియా ఏడుసార్లు, ఇంగ్లాండ్ నాలుగుసార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి. అయితే, ఈ సారి ఆ జట్లేవీ ఫైనల్‌కు రాలేదు. కొత్త ఛాంపియన్‌గా నిలవడానికి భారత్, సౌతాఫ్రికా సై అంటే సై అంటున్నాయి. 2005, 2017లో విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని మిస్ చేసుకున్న భారత్.. మూడోసారి ఎలాగైనా టైటిల్‌ను ఎగరేసుపోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికీ, సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి ఫైనల్ చేరిన హర్మన్‌ప్రీత్ సేన.. అదే జోరును సఫారీలపై కొనసాగిస్తే కప్పు కల నెరవేరినట్లే.
Read Also: Fingerprint technology: మరణించిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ తో ఫోన్ అన్ లాక్ ఎలా చేయొచ్చు
దీప్తి మెరిస్తేనే..
లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి సెమీస్‌కు వచ్చిన సఫారీలు.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొకోకపోవడమే. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 69 పరుగులకు, ఆస్ట్రేలియాపై 97 రన్స్‌కే కుప్పకూలింది. సఫారీల స్పిన్ బలహీనతను ఫైనల్‌లో భారత్ సొమ్ము చేసుకోవాలి. భారత్‌కు దీప్తి శర్మ రూపంలో మంచి స్పిన్నర్ ఉంది. ఆమె ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టింది. ఫైనల్‌లోనూ దీప్తి మెరిస్తే భారత్‌కు గెలుపునకు దగ్గరైనట్లే. ఆసీస్ తో సెమీస్‌లో భారీగా పరుగులు ఇచ్చిన రాధా యాదవ్‌పై వేటు వేసి మరో స్పిన్నర్ స్నేహ్ రాణాను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: Bigg Boss Elimination: అమ్మని కాపాడిన కూతురు.. దువ్వాడ అన్నో తనూజ మన పార్టీయే..!
అప్పుడేమైంది?
2005లో మిథాలి రాజ్ నేతృత్వంలో ఫైనల్‌కు వెళ్లిన భారత్.. ఆస్ట్రేలియా ముందు నిలవలేక రన్నరప్ కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 215/4కి కట్టడి చేసిన టీమ్ఇండియా.. లక్ష్యఛేదనలో తేలిపోయింది. మిథాలి రాజ్ (6) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్ 46 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఇక 2017లో మాత్రం భారత్ త్రుటిలో కప్పును మిస్ చేసుకుంది. సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి టైటిల్ సాధించేలా కనిపించిన భారత్.. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై పోరాడి ఓడింది. ఈ సారైనా అమ్మాయిలో విన్ అవుతారో చూడాలి మరి..


