Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీని పురష్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను క్రియేట్ చేసింది. బ్యాట్, బాల్, వికెట్, పిచ్‌ను వర్ణించేలా బ్యూటీఫుల్ కలర్స్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఇవాళ ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్ భారత్-శ్రీలంక మధ్య జరుగుతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీని పురష్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను సృష్టించింది.

ప్రపంచకప్ వేడుకలను గుర్తుచేసుకునేందుకు ఈ డూడుల్‌ను రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. బాల్, బ్యాట్, వికెట్లతోపాటు పలు కలర్లతో అందంగా తీర్చిదిద్దింది. ఈ మేరకు 13వ ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌ను గూగుల్ అద్భుతమైన డూడుల్‌తో వేడుకలను ప్రారంభించింది. పురుషుల ప్రపంచకప్‌కు రెండేళ్ల ముందు 1973లో మహిళల క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభమైందని గూగుల్ తెలిపింది. అప్పటి నుంచి మహిళల క్రికెట్‌కు ప్రజాదరణ క్రమంగా పెరుగుతోందని గూగుల్ ఈ సందర్భంగా వెల్లడించింది.
గూగుల్ డూడుల్ అనేది ఒక ముఖ్యమైన రోజు, పండుగ, సాంస్కృతిక క్షణం లేదా చారిత్రక సంఘటనను జరుపుకోవడానికి గుర్తుగా సృష్టిస్తారు. ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడల్లా గూగుల్ తన హోమ్‌పేజీ లోగోను క్రియేటివ్, ఇంటరాక్టివ్ డిజైన్‌గా మార్చడం జరుగుతోంది. దీనినే డూడుల్ అని అంటారు. కాగా, గూగుల్ ఇప్పటికే 5,000 కంటే ఎక్కువ డూడుల్‌లను సృష్టించడం విశేషం.


