Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. అయితే, మ్యాచ్ ప్రారంభం అయ్యాక ముంబై మొత్తం దద్దరిల్లింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కోసం దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నప్పుడు వరణుడు అడ్డంకిగా మారాడు. రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం అయ్యింది. అయితే, బ్యాటింగ్ చేసిన భారత్ జోరు చూపించింది. అయితే, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా 5 గంటలకు మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87; 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (45; 58 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. చివర్లో రిచా ఘోష్ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ (24), హర్మన్‌ప్రీత్ కౌర్ (20), అమన్‌జ్యోత్ కౌర్ (12) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3, మ్లాబా, క్లో ట్రయాన్, నడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీశారు.
Read Also: Microsoft: నియామకాలు ఉన్నాయి..కానీ ఏఐ తర్వాతే!
ఈసారి ఓపెనర్ల హవా..
ఫామ్ లో ఉన్న ఓపెనర్లు మంధాన, షెఫాలీ ఆరంభం నుంచి నిలకడగా ఆడి భారత్‌కు శుభారంభం అందించారు. హాఫ్ సెంచరీ ముంగిట స్మృతి ఔటైంది. దీంతో తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్‌లో షెఫాలీ అర్ధ శతకం (49 బంతుల్లో) అందుకుంది. తర్వాత జెమీమాతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది షెఫాలీ. సెంచరీ దిశగా సాగుతున్న ఆమెను అయబొంగా వెనక్కి పంపింది. కాసేపటికే జెమీమా కూడా పెవిలియన్ చేరింది. ఈ దశలో దీప్తి, హర్మన్‌ప్రీత్ కౌర్ నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం అందించారు. మ్లాబా బౌలింగ్‌లో కౌర్ క్లీన్‌బౌల్డ్ అయింది. అమన్‌జ్యోత్‌ను డి క్లెర్క్ ఔట్ చేసింది. దూకుడుగా ఆడిన రిచా ఘోష్ అయబొంగా వేసిన 49 ఓవర్‌లో ఔట్ కాగా.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి దీప్తి రనౌటైంది.
Read Also: WWC: ఇండియా–దక్షిణాఫ్రికా పోరు: ఈ ఐదే టీమిండియాకి బలం


