Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రెండో సెమీఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు రసవత్తరంగా జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఇక, బ్యాటింగ్ కు దిగిన భారత్ జాగ్రత్తగా ఆటను కొనసాగిస్తోంది. ఇక, ఆట ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. కిమ్‌గార్త్ బౌలింగ్‌లో రెండో ఓవర్లోనే ఎల్బీడబ్ల్యూగా షఫాలీ వర్మ (10) వెనదిరిగింది. ఆ తర్వాత, కిమ్ గార్త్ బౌలింగ్‌లోనే స్మృతి మంధాన (24) వికెట్ కీపర్ అలీసా హీలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. దీంతో, 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత్. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోర్ 94/2గా నిలిచింది. అనాబెల్ సదర్లాండ్ వేసిన ఓవర్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు. అయితే, అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ స్కోర్ 107/1గా ఉంది.
Read Also: Australian cricketer: ఘోర విషాదం.. మైదానంలోనే క్రికెటర్ మృతి
సెంచరీ చేసిన లీచ్ ఫీల్డ్
ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ బాదింది. ఎలీస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసింది. ఇక, ఆష్లీన్ గార్డ్‌నర్ (63; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చితక్కొట్టింది. బెత్ మూనీ (24), కిమ్ గార్త్ (17), తాహిలా మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
Read Also: INDW vs AUSW: టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ ఫస్ట్ బౌలింగ్
ఇన్నింగ్స్ ఆరంభంలోనే..
అయితే, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. రేణుక సింగ్ బౌలింగ్‌లో అలీసా హీలీ (5) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. ఆమె ఔటైన వెంటనే వర్షం కురవడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఫోబ్ లీచ్‌ఫీల్డ్ బౌండరీలతో విరుచుకుపడింది. ఆమె 45 బంతుల్లో హాఫ్ సెంచరీ, 77 బంతుల్లోనే సెంచరీ చేసేసింది. వన్ డౌన్‌లో వచ్చిన ఎలీస్ పెర్రీ కూడా నిలకడగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. లీచ్‌ఫీల్డ్‌ని అమన్‌జ్యోత్ వెనక్కి పంపడంతో 155 పరుగుల భాగస్వామ్యానికి (133 బంతుల్లో) తెరపడింది. తర్వాత వచ్చిన బెత్ మూనీ, సదర్లాండ్‌ను శ్రీ చరణి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపింది. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పెర్రీని రాధాయాదవ్ ఔట్ చేయడంతో 42 ఓవర్లకు ఆసీస్ 271/6తో నిలిచింది. తర్వాత గార్డ్‌నర్ జోరు పెంచింది. రాధా యాదవ్ వేసిన 49 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన గార్డ్‌నర్.. తర్వాతి బంతికే రనౌటైంది. దీప్తి వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అలానా కింగ్ (4), సోఫీ మోలినెక్స్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఐదో బంతికి కిమ్ గార్త్ రనౌట్‌గా వెనుదిరిగింది.


