Saturday, November 15, 2025
HomeTop StoriesWomen’s World Cup: ఆట బాలేదు.. పక్కన పెట్టేస్తున్నా.. కానీ ఈ రియాక్షన్ అస్సలు ఊహించలేదేమో!

Women’s World Cup: ఆట బాలేదు.. పక్కన పెట్టేస్తున్నా.. కానీ ఈ రియాక్షన్ అస్సలు ఊహించలేదేమో!

Women’s World Cup: మహిళల వరల్డ్ కప్ లో భారత్ చరిత్ర లిఖించింది. ఈ టోర్నమెంట్ లో ఓటమి ఎరుగని కంగారూలు ఖంగు మనేలా చేసింది. అయితే, ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర జెమీమా రోడ్రిగ్స్ దే. ‘నీ ఆట బాలేదు.. పక్కన పెట్టేస్తున్నాం’.. వరల్డ్‌ కప్‌లో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు ముందు జెమీమా రోడ్రిగ్స్‌కి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పిన మాటలివి. ఆ మాటలు జెమీమాకు నచ్చలేదు.. ఏమాత్రం నచ్చలేదు. ఎంతగా నచ్చలేదంటే.. జట్టులోకి రిటర్న్‌ రావడం, రావడంతోనే కివీస్‌పై హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడింది. ఇప్పుడు సెంచరీతో వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాను సెమీస్‌లోనే ఇంటికి దారి చూపించింది.

- Advertisement -

Read Also: Women’s World Cup: 2017 హిస్టరీ రిపీట్.. ప్రపంచ కప్ ఫైనల్స్ కు భారత్

టోర్నమెంటుకు ముందు
0, 32, 0, 33.. ఇవీ జట్టు నుంచి పక్కన పెట్టడానికి ముందు ఈ టోర్నీలో వరుస మ్యాచ్‌ల్లో జెమీమా చేసిన పరుగులు. అయితే, జట్టులోకి తిరిగి వచ్చాక 76, 127* పరుగులతో విరుచుకుపడింది. ఈ గణాంకాలు చాలు తనను జట్టు నుంచి తప్పించడంపై జెమీమా రియాక్షన్‌ తెలియడానికి. ఆమె ఓ ఎక్స్ ప్లోజివ్ బ్యాటర్.. భారీ షాట్లతో మ్యాచ్ ను అమాంతం మార్చే కెపాసిటీ ఆమెది. కానీ, వరల్డ్ కప్ ఆరంభ మ్యాచుల్లో ఎందుకో క్లిక్ కాలేదు. రెండుసార్లు బాగా ఆడుతోంది అనిపించినా.. ఔటైపోయి నిరాశపడింది, నిరాశపరిచింది. కానీ రీఎంట్రీలో తనదైన శైలిలో అదరగొట్టి ఏకంగా జట్టును ఫైనల్‌కి చేర్చింది. ఈ క్రమంలో రికార్డు ఛేజింగ్‌ స్కోరు కొట్టి.. ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియాను ఓడించింది.

Read Also: Women’s World Cup: సెంచరీతో అదగొట్టిన జెమీమా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆమెనే..

క్రికెట్‌ మాత్రమే కాదు.. ఇంకా…

జెమీమా.. దేశవాళీ క్రికెట్‌లో ఎంట్రీ ఇవ్వడమే ఓ తుపాను. 2012లో ఆమె అండర్‌ 19 జట్టులోకి రావడం అప్పట్లో ఓ సంచలనం. వచ్చీ రాగానే పరుగులు చేయడం ఒక విషయమైతే.. అప్పటికే అప్పటికే ఆమె స్పోర్ట్స్‌ ప్లేయర్‌ కావడం మరో విశేషం. క్రికెట్‌లోకి రాకముందు జెమీమా హాకీ ప్లేయర్‌. జాతీయ స్థాయికి కూడా ఆడింది. అంతకుముందు బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కూడా. నాలుగేళ్ల వయసు నుంచే ఈ స్పోర్ట్స్‌ అన్నింటిలో ప్రావీణ్యం పొందింది. జెమీమాకు మెరుగైన క్రీడా వసతులు అందించడం కోసం తన కుటుంబం ముంబయిలోని భందూప్‌ నుంచి బాంద్రాకు మకాం మార్చింది. నాలుగేళ్ల వయసులోనే జెమీమా క్రికెట్ బ్యాట్‌ పట్టింది. అప్పటి నుంచి భారత జట్టులోకి అడుగు పెట్టేంతవరకు తండ్రి ఇవాన్‌ కోచింగ్‌లోనే క్రికెట్‌ మెళకువలు నేర్చుకుంది. 

తండ్రే ఆమెకు హీరో

తన తండ్రే తన హీరో అని జెమీమా ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఆస్ట్రేలియా మీద గెలిచాక మైదానంలోనే బోరున ఏడ్చేసి అప్పటివరకు తనెంత భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకుందో చూపించిన జెమీమా.. ఆ తర్వాత తన హీరోని హత్తుకున్నాక కానీ మామూలు మనిషి అవ్వలేదు. సెంచరీ సాధించినప్పుడు కాకుండా జట్టును గెలిపించాకే శతకం సంబరాలు చేసుకుంది. జట్టు ముందు మైలురాళ్లు తర్వాత అనే ఆమె తత్వం అక్కడే అర్థమవుతోంది. అన్నట్లు ఈ విజయంతో జెమీమా తన మీద ఉన్న ఓ అపవాదును కూడా పటాపంచలు చేసింది. మైదానంలో ఎప్పడూ డ్యాన్స్‌లు వేస్తూ, ప్రేక్షకుల్ని ఉత్సాహపరుస్తూ సందడి చేసే ఆమెను ‘క్రికెట్‌ తక్కువ.. ఆటలెక్కువ’ అని కొంతమంది ట్రోల్‌ చేస్తుంటారు. ఇక, ఇప్పుడు ఆ ట్రోలర్స్ అందరూ నోరుమూసుకోవాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad