Women’s World Cup: మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. టోర్నమెంటులో ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోని అజేయ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్ ను ఓడించింది. ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇదే సమయంలో 8 ఏళ్ల క్రితం జరిగిన హిస్టరీని భారత్ మరోసారి రిపీట్ చేసింది. అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా రాణించారు. ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఇక, ఆట ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. కిమ్‌గార్త్ బౌలింగ్‌లో రెండో ఓవర్లోనే ఎల్బీడబ్ల్యూగా షఫాలీ వర్మ (10) వెనదిరిగింది. ఆ తర్వాత, కిమ్ గార్త్ బౌలింగ్‌లోనే స్మృతి మంధాన (24) వికెట్ కీపర్ అలీసా హీలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. దీంతో, 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత్. అయితే, జెమీమా రోడ్రిగ్స్ అద్భుత శతకంతో భారత్ గెలిచింది. ఆమె, హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయితే, వీరి భాగస్వామ్యాన్ని ఆశ్లే గార్డెనర్ విడగొట్టింది. 89 పరుగుల దగ్గర హర్మన్ కు ఔట్ చేసింది.
Read Also: Australian cricketer: ఘోర విషాదం.. మైదానంలోనే క్రికెటర్ మృతి
సెంచరీ చేసిన లీచ్ ఫీల్డ్
ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ బాదింది. ఎలీస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసింది. ఇక, ఆష్లీన్ గార్డ్‌నర్ (63; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చితక్కొట్టింది. బెత్ మూనీ (24), కిమ్ గార్త్ (17), తాహిలా మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
Read Also: Bigg Boss Re Entry: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. భరణికే గుద్దిపారేశారయ్యో
8 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..
2017 మహిళల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు భారత్ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ ఎడిషన్ సెమీఫైనల్లో రెండు జట్లు తలపడ్డాయి. టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించడంతో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 171 పరుగులతో అజేయంగా నిలిచింది . ఆస్ట్రేలియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా ఆ టోర్నీలో ఆస్ట్రేలియాకు వరల్ట్ కప్ ను దూరం చేసింది. ఎనిమిదేళ్ల భారత్ అదే హిస్టరీని రిపీట్ చేస్తుందని క్రికెట్ అభిమానుల ఆశ నెరవేరింది.


