Friday, September 20, 2024
HomeఆటHyd: వల్డ్ ఛాంప్ నిఖత్ జరీన్ కు డీజీపీ అభినందన

Hyd: వల్డ్ ఛాంప్ నిఖత్ జరీన్ కు డీజీపీ అభినందన

2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన నిఖత్ జరీన్ ను డీజీపీ అంజనీ కుమార్ నేడు దుశ్శాలువా, పుష్పగుచ్చాలతో అభినందించారు. బీఆర్ కేఆర్ భవన్ లో సి.ఎస్. శాంతి కుమారిని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ నిఖత్ జరీన్ ను అభినందించారు.

- Advertisement -

ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని, నేటి యువ క్రీడాకారులకు జరీన్ ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News