Mehboob alam Creates History: వన్డే క్రికెట్‌లో అద్భుతం చోటుచేసుకుంది. 50 ఓవర్ల పరిమిత క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ఒక్కడే తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు నేపాల్ కు చెందిన పేస్ బౌలర్ మెహబూబ్ ఆలం. ఇప్పటి వరకు ఏ బౌలర్ కు సాధ్యం కాని ఘనతను ఇతడు సొంతం చేసుకున్నాడు. ఈ ప్రపంచ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 2008 మే 25న ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 5 టోర్నమెంట్ జరిగింది. ఈ లీగ్ లో మొజాంబిక్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మెహబూబ్ ఆలం కేవలం 7.5 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి మొత్తం 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. హేమాహేమీలు సాధ్యం కాని రికార్డును ఇతడు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.
ఈ వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన మొజాంబిక్ జట్టు 14.5 ఓవర్లలో 19 పరుగులకే ఆలౌట్ అయింది. మెహబూబ్ ఆలం తన బౌలింగ్ స్పెల్‌లో 7.5 ఓవర్లు వేసి 12 పరుగుల మాత్రమే ఇచ్చి పది వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది. ఈ 50 ఓవర్ల మ్యాచులో నేపాల్ జట్టు 219 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన మెహబూబ్ ఆలం ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Also Read: ODI- ఒక్కసారి కూడా డకౌట్ కానీ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?
వన్డే మ్యాచులో గరిష్టంగా 50 ఓవర్లు ఉంటాయి. అంటే ఒక బౌలర్ 10 ఓవర్ల మాత్రమే బౌలింగ్ చేయగలడు. అలాంటిది ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం ఆషామాషీ విషయం కాదు. ఇలాంటి ఫీట్ సాధించడం దిగ్గజ బౌలర్లకే సాధ్యం కాలేదు. కానీ నేపాల్ కు చెందిన మెహబూబ్ ఆలం సునాయసంగా సాధించి వరల్డ్ రికార్డు సృషించాడు. ఇతడు ఎడమ చేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు ఎడమచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ కూడా. ఈ నేపాల్ మాజీ బౌలర్ వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు.
Also Read: Cricket :- క్రికెట్ చరిత్రలోనే ఇదొక హఠాత్ పరిణామం


