WTC India:లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. విజయం అంచుల దగ్గరకు వెళ్లి మరీ మ్యాచ్ ఓడింది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఇంగ్లాండ్ విజయం సాధించగా.. ఒక్క మ్యాచ్‌లోనే భారత్ నెగ్గింది. ప్రస్తుతం ప్రత్యర్థి టీమ్ పైచేయి సాధించింది. అయితే సోమవారం ముగిసిన మూడో టెస్టు మాత్రం మరింత రసవత్తరంగా మారింది. కేవలం 22 పరుగుల తేడాతో భారత్ జట్టు ఓడింది. ఈ టెస్టు ఓటమితో టీమ్ఇండియా ఆత్మవిశ్వాసం మందగించిందనే చెప్పాలి.
గెలుపుతో ఇంగ్లాండ్ దూసుకెళ్లింది..
ఈ మ్యాచ్ గెలుపుతో ఇంగ్లాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–27 టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ పాయింట్ల శాతం (PCT) 50గా ఉండగా.. ఇప్పుడు 66.67కి పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది.
భారత్ నాలుగో స్థానం
ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచిన భారత్..33.3 పాయింట్ల శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ఇండియా కంటే దిగువన బంగ్లాదేశ్, వెస్టిండీస్ మాత్రమే ఉన్నాయి. ఈ ఓటమి భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడడంపై ప్రభావం చూపుతుంది.
మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకం
ఇంగ్లాండ్ సిరీస్‌లో భాగంగా ఇంకో రెండు టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సిరీస్ గెలుపోటములే కాకుండా.. డబ్ల్యూటీసీ టెబుల్ పై కూడా ఈ మ్యాచ్‌లు కీలకంగా మారనున్నాయి. అయితే మరోవైపు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు తమ తమ సిరీస్‌లను పూర్తి చేయని కారణంగా రాబోయే రోజుల్లో ర్యాంకింగ్స్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది.


