మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2025) మూడో సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగుతోంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ కోసం తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇక రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, గుజరాత్‌తో తలపడనుంది. వడోదరా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్‌కి సంబంధించిన మ్యాచ్‌లు టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో జియో సినిమాస్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.