WPL 2026 Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మంగళవారం జరగనున్న హై-వోల్టేజ్ ‘ఎలిమినేటర్’ పోరులో మాజీ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, ఫామ్‌లో ఉన్న గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకుంటుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఢిల్లీ నాలుగోసారి ఫైనల్ చేరేనా?
డబ్లూపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టుగా పేరున్న ఢిల్లీ క్యాపిటల్స్, వరుసగా నాలుగో ఏడాది ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే, గత మూడు సీజన్లలో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ.. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ లో లారా వోల్వార్డ్ (241 పరుగులు), లిజెల్ లీ (240) నిలకడగా ఆడుతున్నారు. గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. బౌలింగ్‌లో నందని శర్మ (14 వికెట్లు) అద్భుతంగా రాణిస్తోంది. ఆమెకు తోడుగా స్పిన్నర్ శ్రీ చరణి (14), అనుభవజ్ఞురాలు మరిజన్నే కాప్ (10) కూడా ఉన్నారు. ఓపెనర్ షెఫాలీ వర్మ ఫామ్ ఆందోళన పరుస్తోంది.
జోరు మీదున్న జెయింట్స్
టోర్నీ ఆరంభంలో వరుసగా మూడు ఓటములతో కుదేలైన గుజరాత్, ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో అద్భుతంగా పుంజుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి సెమీస్‌కు చేరడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కివీస్ స్టార్ సోఫీ డివైన్ ఈ సీజన్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. ఆమె 17 వికెట్లతో లీగ్ టాప్ బౌలర్‌గా ఉండటమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ 237 పరుగులు చేసింది. ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, జార్జియా వేర్‌హామ్ వంటి స్టార్ ప్లేయర్లతో గుజరాత్ చాలా బలంగా కనిపిస్తోంది. లీగ్ దశలో ఢిల్లీపై రెండుసార్లు గెలవడం వారికి కలిసొచ్చే అంశం.
Also Read: Salman Ali Agha -‘మా చేతుల్లో ఏమీ లేదు’.. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై నోరు విప్పిన పాక్ కెప్టెన్..
ఇరు జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), తానియా భాటియా, చినెల్లె హెన్రీ, లిజెల్ లీ, నికి ప్రసాద్, షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, లూసీ హామిల్టన్, మారిజానే కాప్, అలనా కింగ్, స్నేహ రాణా, ప్రగతి సింగ్, మిన్ను మణి, నందనీ చర్మ, శ్రీచరణి, ఎడ్ల సృజన.
గుజరాత్ జెయింట్స్: అష్లీగ్ గార్డనర్ (కెప్టెన్), కనికా అహుజా, సోఫీ డివైన్, భారతీ ఫుల్మాలి, కిమ్ గార్త్, కష్వీ గౌతమ్, రాజేశ్వరి గయాక్వాడ్, హ్యాపీ కుమారి, జింటిమణి కలితా, తనూజా కన్వర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), రేణుకా సింగ్, అనుష్కా శర్మ, శివాని సింగ్, ఆయుషి సోనీ, జార్జియా వేర్‌హామ్, డాని వ్యాట్-హాడ్జ్

