WPL 2026 Retention List: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలం నవంబర్ 27న జరగబోతుంది. ఈ సీజన్ కు సంబంధించిన రిటెన్షన్ గడువు నిన్నటితో(నవంబర్ 6) ముగియడంతో ఫ్రాంచైజీలన్నీ తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈసారి రిటెన్షన్స్‌లో కొన్ని ఫ్రాంఛైజీలు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇటీవల జరిగిన మహిళా ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి శర్మతో పాటు సౌతాఫ్రికాను ఫైనల్ వరకు తీసుకెళ్లిన లారా వోల్వార్ట్ ను వారి జట్లు విడుదల చేశాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్ మెగ్ లానింగ్‌ను వారి జట్టు రిలీజ్ చేయడం గమనార్హం.
ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉండాలి. ఏదైనా ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలనుకుంటే..వారిలో కనీసం ఒకరు అన్‌క్యాప్డ్ ఇండియన్ ఫ్లేయిర్ అయి ఉండాలి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్ల చొప్పున రిటైన్ చేసుకోగా.. ఆర్సీబీ నలుగురు ప్లేయర్స్ ను, గుజరాత్ జెయింట్స్ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. యూపీ వారియర్స్ కేవలం ఒక్కే ఒక్క ప్లేయర్‌ను మాత్రమే ఉంచుకుంది. డబ్ల్యూపీఎల్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ రెండు సార్లు, ఆర్సీబీ ఒకసారి నెగ్గాయి.
Also Read: ICC T20I Rankings -దుమ్మురేపిన టీమ్ ఇండియా ఆటగాళ్లు.. అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా
ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), నాట్ స్కైవర్-బ్రంట్ (రూ.3.5 కోట్లు), హేలీ మాథ్యూస్ (రూ.1.75 కోట్లు), అమంజోత్ కౌర్ (రూ.1 కోటి), G కమలిని (రూ.50 లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ.2.2 కోట్లు), మారిజాన్ కాప్ (రూ.2.2 కోట్లు), అన్నాబెల్ సదర్లాండ్ (రూ.2.2 కోట్లు), నికి ప్రసాద్ (రూ.50 లక్షలు)
RCB: స్మృతి మంధాన (రూ.3.5 కోట్లు), ఎల్లీస్ పెర్రీ (రూ.2 కోట్లు), రిచా ఘోష్ (రూ.2.75 కోట్లు), శ్రేయంకా పాటిల్ (రూ.60 లక్షలు)
గుజరాత్ జెయింట్స్: ఆష్ గార్డ్నర్ (రూ.3.5 కోట్లు), బెత్ మూనీ (రూ.2.5 కోట్లు)
UP వారియర్జ్: శ్వేతా సెహ్రావత్ ( రూ.50 లక్షలు)


