WTC 2025-27 Season Started: లార్డ్స్ వేదికగా ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ 2023-2025 ఫైనల్లో సౌతాఫ్రికా జట్టు ఛాంపియన్స్‌గా నిలిచి చరిత్ర సాధించిన సంగతి తెలిసిందే. అటు 2023-25 సీజన్ ముగిసిందో లేదో.. ఇటు 2025-27 సీజన్ ప్రారంభమైంది. శ్రీలంక-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంతో ఈ సీజన్ మొదలైంది. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు జూన్ 17 నుంచి 21 వరకు, రెండో టెస్టు జూన్ 25 నుంచి 29 వరకు జరగనుంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక సీనియర్ ఆటగాడు మ్యాథ్యూస్ తొలి టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడు.
ఇదిలా ఉంటే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్లో శ్రీలంక జట్టు 13 మ్యాచ్‌లు ఆడి ఐదు మాత్రమే గెలిచింది. ఎనిమిది మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో 60 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇక బంగ్లాదేశ్ టీమ్ 12 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలవగా.. ఎనిమిది మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. దాంతో 45 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లోనైనా సత్తా చాటి ఫైనల్‌కు చేరుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
శ్రీలంక జట్టు: పాతూమ్ నిశాంక, లాహిరు ఉదర, దినేష్ చండిమల్, మాథ్యూస్, కమిందు మెండిస్, ధనుంజయ డిసెల్వ (కెప్టెన్), కుశాల్ మెండిస్, మిలాన్ ప్రియానంద్, తారిందు, ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో.
బంగ్లాదేశ్ జట్టు: ఇస్లాం, అనుమల్ హఖ్, మోమినల్ హఖ్, నజ్ముల్ హుస్పేన్ షాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, జాకీర్ అలీ, నయీమ్ హసన్, తంజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహీద్ రాణా.