వరల్డ్ రెజ్లింగ్ లెజెండ్ సీనియర్. రే మిస్టీరియో(66) మృతి పట్ల WWE రెజ్లర్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రే మిస్టీరియో(Rey Mysterio) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబం ప్రకటించింది. ఈయన WWE సూపర్ స్టార్ డామినిక్ మిస్టీరియోకి తాత, జూనియర్ రే మిస్టీరియోకి మామ. రే మిస్టీరియో అసలు పేరు మిగల్ ఏంజెల్ లోపెజ్ దియాస్. మెక్సికోలో జన్మించిన మిస్టీరియో 1976లో రెజ్లింగ్‌లో అడుగుపెట్టారు. ప్రో రెజ్లింగ్ రెవల్యూషన్, టిజువానా రెజ్లిండ్, వరల్డ్ రెజ్లింగ్ అసోసియేషన్ వంటి పోటీల్లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
కొన్ని రోజుల క్రితమే రే మిస్టీరియో జూనియర్ తండ్రి రాబర్ట్ గుర్టిరెజ్(76) కన్నుమూశాడు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే రే మిస్టీరియో సీనియర్ కూడా కన్నుమూయడం మిస్టీరియో కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది. బాక్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రే మిస్టీరియా రెజ్లింగ్ వైపు దృష్టి పెట్టాడు. 2009లో రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రే మిస్టీరియో రెండు సార్లు IWC వరల్డ్ మిడ్‌వెయిట్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచాడు. కాగా ఆయన మృతిపై WWE ప్లేయర్లు తమ సంతాపం వ్యక్తపరుస్తున్నారు.