Saturday, November 15, 2025
HomeఆటYash Dayal: ఆర్సీబీ బౌలర్​కు భారీ షాక్- 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?

Yash Dayal: ఆర్సీబీ బౌలర్​కు భారీ షాక్- 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?

Yash Dayal: ఈ ఏడాది ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ యశ్ దయాల్​ గుర్తున్నాడా? ఈ స్టార్ బౌలర్‌కి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్​లో ఇతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ యువతి యశ్ దయాల్‌పై గతనెల ఆరోపించింది. ఇదే విషయమై ఆమె ఇటీవల యూపీ సీఎం ఆన్‌లైన్‌ పోర్టర్‌లోనూ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ ఫిర్యాదుపై ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన యూపీ పోలీసులు యశ్ దయాల్​పై తాజాగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

- Advertisement -

ఏం జరిగింది?
ప్రముఖ క్రికెటర్ యశ్​ దయాల్​ తనతో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాడని ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఇటీవల బహిరంగంగా ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి మోసం చేశాడని చెప్పింది. బౌలర్ యశ్ దయాల్.. తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆమె లైంగిక ఆరోపణలు చేసింది. అంతేకాకుండా కాబోయే కోడలు అని చెప్పి దయాల్ తన ఇంట్లో కూడా పరిచయం చేశాడని తెలిపింది.
అయితే కొంత కాలం తర్వాత యశ్ దయాల్ ఇంకో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు తెలిసిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయమై తనను నిలదీస్తే.. హింసించాడని, అలాగే రిలేషన్​షిప్​లో ఉన్న సమయంలో తన వద్ద డబ్బులు సైతం తీసుకున్నట్లు సదరు బాధిత యువతి ఆరోపించింది.
ఆధారాలతో సహా..
యశ్ దయాల్‌తో రిలేషన్​షిప్​నకు ఆధారాలతో సహా సదరు యువతి పోలీసులకు ఆశ్రయించింది. క్రికెటర్‌తో తీసుకున్న ఫొటోలు, వీడియో కాల్స్‌, చాటింగ్​కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఆధారాలుగా చూపించింది. అయితే దీనిపై యశ్ దయాల్‌తో పాటు అతని సన్నిహితులు కూడా స్పందించలేదు.

దోషిగా తేలితే 10 ఏళ్లు జైలు శిక్ష?
యశ్ దయాల్​పై సెక్షన్ 69 కింద ఈ కేసు నమోదైంది. పెళ్లి లేదా ఉద్యోగం గురించి తప్పుడు హామీలు ఇవ్వడం, మోసపూరిత వాగ్దానాలు చేసిన వాటి కింద ఈ కేసు నమోదు చేస్తారు. ఇందులో ఇతను దోషిగా తేలితే దాదాపు 10ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad