Yashasvi Jaiswal Surpasses Sachin Tendulkar: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 23 ఏళ్ల ఈ బ్యాటర్ 253 బంతుల్లో 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి. ఇది జైస్వాల్‌కు టెస్టుల్లో ఏడవ సెంచరీ కాగా, ఐదోసారి 150 ప్లస్ స్కోర్‌గా మారింది.
ఈ అసాధారణ ప్రదర్శనతో ఈ యువ సంచలనం ఒక భారీ రికార్డును నెలకొల్పాడు. 23 ఏళ్ల వయస్సులో టెస్టు క్రికెట్‌లో అత్యధిక 150-ప్లస్ స్కోర్‌లు (5) సాధించిన భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
ALSO READ: Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డ్
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
గతంలో ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ తన 24వ పుట్టినరోజు కంటే ముందే నాలుగు 150-ప్లస్ స్కోర్‌లు మాత్రమే సాధించాడు. ఇప్పుడు జైస్వాల్ ఐదో 150 ప్లస్ స్కోర్‌తో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ 8 స్కోర్లతో అగ్రస్థానంలో ఉండగా, జైస్వాల్ రెండో స్థానంలో నిలిచాడు.
జైస్వాల్ ఆటతీరుపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసలు కురిపించారు. అతను దూకుడుగా ఆడకుండానే 173 పరుగులతో నాటౌట్‌గా నిలవడం అద్భుతమన్నారు. “అతను తన ఇన్నింగ్స్‌ను ఆడిన తీరు చాలా అద్భుతం. వికెట్‌కు అనుగుణంగా అతను అనుసరించిన విధానం, షాట్లు ఎంచుకున్న పద్ధతి, బౌన్స్, పేస్ వంటి వాటికి అలవాటు పడిన తీరు అమోఘం” అని కోటక్ అన్నారు. అహ్మదాబాద్‌లో మంచి ఆరంభం లభించినా పెద్ద స్కోరు చేయలేకపోయానని జైస్వాల్ కాస్త నిరాశ చెందాడని, అందుకే ఇక్కడ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని తను కృత నిశ్చయంతో ఉన్నాడని కోటక్ పేర్కొన్నారు.
ALSO READ: Hardik Pandya: హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?


