Thursday, May 1, 2025
Homeఆటధోనీ నేనూ ఒకేలా ఉంటామన్న ఉప్పల్ బాలు.. చంపేస్తామంటున్న తల ఫ్యాన్స్..!

ధోనీ నేనూ ఒకేలా ఉంటామన్న ఉప్పల్ బాలు.. చంపేస్తామంటున్న తల ఫ్యాన్స్..!

ఐపీఎల్ 2025 జోరుగా సాగుతోంది. ఈ సమయంలో యూట్యూబర్ ఉప్పల్ బాలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉప్పల్ బాలు… ‘తనకు మహేంద్రసింగ్ ధోనీకి చాలానే పోలికలు ఉన్నాయి. ముఖం, హెయిర్ స్టైల్… అన్నీ సేమ్ టు సేమ్ అని చాలామంది చెబుతుంటారని.. తమ ఫొటోలు పక్కపక్కన పెట్టి వైరల్ చేస్తుంటారు అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుండగానే.. ధోనీ అభిమానులు ఆగ్రహంతో ఫైర్ అయ్యారు.

- Advertisement -

ఉప్పల్ బాలు నువ్వెక్కడ.. ధోనీ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. పాపులర్ అవ్వాలనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతలో కొంతమంది నెటిజన్లు మాత్రం ఫన్నీగా స్పందిస్తున్నారు. ధోనీకి తెలుగు రాదు కాబట్టి పర్వాలేకపోయిందని.. లేకపోతే వారం రోజులు భోజనం మానేస్తాడు అంటూ కామెడీగా కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై మీమ్స్ కూడా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇక మహీ అభిమానులు… మళ్లీ ఇలాంటివి మాట్లాడితే క్షమించం అంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే బాలు గతంలోనూ ధోనీపై అలానే మాట్లాడాడని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అదే చేశాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు బాలూ ఈ రియాక్షన్లకు ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇదిలా ఉండగా ఈ ఘటన ధోనీ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు దారి తీసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News