Sunday, November 16, 2025
HomeఆటYuvraj Singh: రోహిత్ శర్మపై యువరాజ్ సింగ్ ప్రశంసలు

Yuvraj Singh: రోహిత్ శర్మపై యువరాజ్ సింగ్ ప్రశంసలు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ప్రశంసలు కురిపించారు. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని కొనియాడారు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలవడంతో పాటు టీ20 ప్రపంచకప్ గెలిచిందని గుర్తుచేశారు. ఫామ్ లేమి కారణంగా మ్యాచ్ నుంచి తనకు తానుగా తప్పకున్న నాయకుడిని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. రోహిత్ తొలి ప్రాధాన్యత జట్టే అని మరోసారి నిరూపించారని తెలిపారు.

- Advertisement -

కాగా ఇటీవల బోర్డర్-గావస్కర్ టోర్నీలో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి తోడు వ్యక్తిగతంగా పరుగులు రాబట్టడంలో రోహిత్ శర్మ విఫలమయ్యారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే రోహిత్ మాత్రం ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరికొన్ని నెలలు కెప్టెన్‌గా ఉంటానంటూ బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. టీమిండియా తదుపరి టెస్టు సిరీస్ ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్ కూడా అప్పుడే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కెప్టెన్‌ను చూసుకోవాలని బీసీసీఐకి రోహిత్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సెలెక్టర్లు బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, యశస్వి జైశ్వాల్ పేర్లు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad