Sunday, October 6, 2024
HomeఆటZomoto: జొమాటో డెలివరీ ఏజెంట్ గా ఇంటర్నేషనల్ వుమెన్ ఫుట్ బాలర్

Zomoto: జొమాటో డెలివరీ ఏజెంట్ గా ఇంటర్నేషనల్ వుమెన్ ఫుట్ బాలర్

క్రికెటర్స్ కు తప్పితే మనదేశంలో మరే ఇతర క్రీడలకు సరైన ప్రోత్సాహం, సపోర్ట్ దొరకదనే విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని రుజువు చేసేలా మరో స్పోర్ట్స్ ఛాంపియన్ జీవిత పోరాటం తెరపైకి వచ్చింది. సరైన అవకాశాలు, ఆర్థిక సాయం, స్పాన్సరర్స్, ప్రభుత్వ ఉద్యోగం వంటివి ఏవీ దొరక్క క్రికెట్టేతర క్రీడల్లో రాణిస్తున్నవారు వెనకబడిపోతున్నారు.

- Advertisement -

అండర్ -16 వుమెన్ ఫుట్ బాలర్ గా కెరీర్ లో రాణించి పలు అంతర్జాతీయ మ్యూచులు సైతం ఆడిన ఓ మహిళా ప్లేయర్ ఇప్పుడు పొట్టకూటి కోసం జొమాటో ఏజెంట్ గా మారారు. పాలోమి అధికారీ అనే ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ జీవన పోరాటాన్ని.. సంజుక్తా చౌదరి అనే ట్విట్టర్ యూజర్ ఫోటోతో సహా ట్వీట్ చేస్తేగానీ ఈమె పాలోమి కష్టాలు లోకానికి తెలిసి రాలేదు.

ప్రస్తుతం జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా ఆమె పనిచేస్తున్నారు. రోజుకు 300-400 రూపాయలు ఆమె సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒక్కోరోజు ఈమెకు దక్కే కూలి డబ్బు కేవలం 150 రూపాయలే.

ట్విట్టర్ లో వైరల్ అయిన ఈ స్టోరీపై ఫుట్ బాల్ అసోసియేషన్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. పాలోమీని వీరు కాంటాక్ట్ చేశారు. చూడాలి మరి ఈమెకు వీరు ఎలాంటి సాయం చేస్తారో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News