Friday, June 6, 2025
Homeటెక్ ప్లస్Budget Cars: 2025 టాటా ఆల్ట్రోజ్ vs హ్యూందాయ్ i20.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోరు..!

Budget Cars: 2025 టాటా ఆల్ట్రోజ్ vs హ్యూందాయ్ i20.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోరు..!

టాటా మోటార్స్ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌ను 2025 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో అప్‌డేట్ చేసింది. రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు, హ్యుందాయ్ i20, మారుతి బాలెనో, టయోటా గ్లాంజా వంటి ప్రత్యర్థులపై పోటీకి రంగంలోకి దిగింది. అందుకే ఈ విభాగంలో హ్యుందాయ్ i20తో పోల్చితే ఈ ఆల్ట్రోజ్ ఎలా ఉందో చూద్దాం.

- Advertisement -

డిజైన్ & ఎక్స్‌టీరియర్ : 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. అయితే, కొత్తగా వచ్చిన ఫ్లష్ మౌంట్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ LED టెయిల్ లాంప్స్, ఆటోమేటిక్ LED హెడ్‌లైట్స్, LED ఫాగ్ లాంప్స్ (కార్నరింగ్ ఫంక్షన్‌తో) వంటి అంశాలు గట్టి ప్రీమియం ఫీల్‌ను ఇస్తున్నాయి. ఇక హ్యూందాయ్ i20 కూడా శార్ప్ డిజైన్, డ్యూయల్ టోన్ స్కీమ్, LED DRLs వంటి అంశాలతో యువతను ఆకట్టుకునేలా ఉంటుంది.

ఇంటీరియర్ & ఫీచర్లు: టాటా ఆల్ట్రోజ్ తాజా మోడల్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆంబియంట్ లైటింగ్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇక i20లో మాత్రం BOSE సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ Android Auto/Apple CarPlay, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో పాటు మంచి ఇన్‌ఫోటైన్‌మెంట్ అనుభవం లభిస్తుంది.

ఎంజిన్ & పనితీరు: ఆల్ట్రోజ్‌లో 1.2L నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఎంపికల్లో మాన్యువల్, AMT, మరియు DCA (డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్) ఉంటాయి. హ్యూందాయ్ i20లో కూడా 1.2L నాచురల్ పెట్రోల్ (CVT & మాన్యువల్), మరియు 1.0L టర్బో పెట్రోల్ (iMT & DCT) వేరియంట్లు లభిస్తాయి.

భద్రతా ఫీచర్లు: ఐసోఫిక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ అసిస్ట్, ESC వంటి భద్రతా ఫీచర్లు రెండు కార్లలోనూ లభించగా, టాటా కార్లకు క్రాష్ టెస్ట్‌లో అధికంగా రేటింగ్ ఉండడం విశేషం. ఆల్ట్రోజ్ గ్లోబల్ ఎన్‌క్యాప్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన సంగతి తెలిసిందే. ఇక ధర విషయానికి వస్తే.. 2025 టాటా ఆల్ట్రోజ్: ₹6.89 లక్షల నుండి ₹11.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్), హ్యూందాయ్ i20: ₹7.04 లక్షల నుండి ₹11.21 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)

ప్రస్తుతం మార్కెట్‌లో టెక్నాలజీ, భద్రత, ఇంధన ప్రత్యామ్నాయాల పట్ల వినియోగదారుల్లో అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరింత ఆకర్షణీయమైన ఫీచర్లతో, డిజైన్‌లో శ్రద్ధతో, విస్తృత పవర్‌ట్రెయిన్ ఎంపికలతో బలమైన ప్రత్యర్థిగా నిలుస్తోంది. ఇక i20లో నాజూకు స్టైలింగ్, టెక్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నా, ధర పరంగా ఆల్ట్రోజ్ మరింత విలువనిచ్చే కారుగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News