43 Inch Smart Tv Offers imn Amazon Diwali Festival Sale: దీపావళి పండుగ సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ దివాళీ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీలపై మునుపెన్నడూ లేనంత భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే, ఈ రోజు (సోమవారం) రాత్రి 12 గంటలతో ఈ ఆఫర్లు ముగియనున్నాయి. ఆఫర్‌లో భాగంగా.. ఈ దీపావళి పండుగ సీజన్‌లో మీరు 43 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీని అద్భుతమైన డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో అనేక ప్రధాన బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలను సగం కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ భారీ డిస్కౌంట్లతోఎ పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వంటివి కూడా అమెజాన్ అందిస్తోంది. బిగ్ దివాళీ సేల్‌లో తోషిబా, టీసీఎల్, శామ్‌సంగ్, షియోమి, ఫిలిప్స్ వంటి బ్రాండ్లకు చెందిన 43 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీలపై భారీ ధర డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అనేక టీవీలపై 40 నుండి 50 శాతం తగ్గింపు అందిస్తోంది అమెజాన్. అదనంగా వివిధ బ్యాంకుల కార్డ్ చెల్లింపులపై అదనపు ఆఫర్లు సైతం అందిస్తోంది. ఓవైపు స్మార్ట్‌టీవీలపై జీఎస్టీ తగ్గింపు, మరోవైపు, పండుగ ఆఫర్లతో మీ కొత్త స్మార్ట్‌టీవీని ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు.
తోషిబా 43-ఇంచెస్ 4K యూహెచ్‌డీ స్మార్ట్‌టీవీ
ఈ సేల్‌లో తోషిబా 43-ఇంచెస్ 4K యూహెచ్‌డీ స్మార్ట్‌టీవీ కేవలం రూ.19,999 వద్ద లభిస్తుంది. మీరు బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ.3,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్ అనంతరం మీ స్మార్ట్‌టీవీని కేవలం రూ.16,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. డాల్బే డిజిటల్, హెచ్‌డీఆర్ 10, హెచ్‌ఎల్‌జీ వంటి ఫీచర్లతో వస్తుంది.
షియోమి టీవీ ఎఫ్‌ఎక్స్ ప్రో
షియోమి టీవీ ఎఫ్‌ఎక్స్ ప్రో మోడల్‌ను కూడా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ మోడల్‌పై ఏకంగా 47 శాతం ధర తగ్గించింది. కూపన్లు, బ్యాంక్ ఆఫర్‌లను కలుపుకుని దీన్ని రూ.23,999కి బదులుగా రూ.20,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ ప్రీమియం డిస్‌ప్లే, అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని కలిగి ఉంటుంది.
శామ్‌సంగ్ విజన్ ఏఐ 4K యూహెచ్‌డీ స్మార్ట్‌టీవీ
ఈ ఫెస్టివల్ సేల్‌లో 43-అంగుళాల శామ్‌సంగ్ విజన్ ఏఐ 4K యూహెచ్‌డీ స్మార్ట్‌టీవీని కేవలం రూ.33,490 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఏకంగా 39% డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తక్కువ ధరకే ప్రీమియం బ్రాండ్ టీవీని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఫిలిప్స్ 43 ఇంచెస్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీ
దీపావళి సేల్‌లో ఫిలిప్స్ 43 ఇంచెస్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని భారీ డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.29,999 ఉండగా.. కేవలం రూ.21,499 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌టీవీపై కంపెనీ రూ.3,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ టీవీ అద్భుతమైన డిస్ప్లే క్వాలిటీని కలిగి ఉంటుంది.


