Thursday, March 12, 2026
Homeటెక్నాలజీ5G Smartphones: ఫోన్ కొనబోతున్నారా ఆగండి.. ఈ 3 పోన్లలో ఏది 'బెస్ట్' ఏది 'వేస్ట్'...

5G Smartphones: ఫోన్ కొనబోతున్నారా ఆగండి.. ఈ 3 పోన్లలో ఏది ‘బెస్ట్’ ఏది ‘వేస్ట్’ తేల్చేద్దాం రండి

Best Smartphones: స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో 5జి టెక్నాలజీ వచ్చాక యూజర్ అనుభవం పూర్తిగా మారిపోయింది. 5జి వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగినంతగా పెరుగుతుంది, వీడియో స్ట్రీమింగ్ స్మూత్‌గా సాగుతుంది, ఆన్‌లైన్ గేమ్స్ ల్యాగ్ లేకుండా నడుస్తాయి. డౌన్‌లోడ్ అప్‌లోడ్ స్పీడ్స్ మెరుగవడంతో సోషల్ మీడియా, వీడియో కాల్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. అందుకే 5జి ఫోన్ కొనేటప్పుడు కనెక్టివిటీతో పాటు రామ్, బ్యాటరీ, కెమెరా, డైలీ యూజ్ పర్‌ఫార్మెన్స్ అన్నీ చూడాల్సి ఉంటుంది.

- Advertisement -

ఒప్పో రినో15ప్రో మినీ 5జి ఫోన్ (Oppo Reno15Pro Mini 5G)

ఒప్పో రినో15ప్రో మినీ 5జి ఫోన్ ఎలిగెంట్ లుక్ తో కాంపాక్ట్ డిజైన్ లో వస్తుంది. ఇందులో 12జిబి రామ్, 512జిబి స్టోరేజ్ ఉండటంతో ఒకేసారి చాలా యాప్స్ ఓపెన్ చేసినా స్పీడ్ తగ్గదు. డైలీ యూజ్, సోషల్ మీడియా, వీడియోలు చూడడం లైట్ గేమింగ్ అన్నీ స్మూత్ గా సాగుతాయి. చిన్న సైజ్ కావడంతో ఒక్క చేత్తో కూడా ఈజీగా వాడుకోవచ్చు. కెమెరా డేలైట్ లో షార్ప్ ఫోటోలు ఇస్తుంది, బ్యాటరీ ఒక రోజు నార్మల్ యూజ్ కి సరిపోతుంది. ఈ ఫోన్ అంచనా ధర 35,000 నుంచి 40,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

రియల్‌మి నార్జో90 5జి ఫోన్ (realme NARZO 90 5G phone)

రియల్‌మి నార్జో90 5జి ఫోన్ లో ప్రధాన ఆకర్షణ 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. రోజంతా హెవీ యూజ్ చేసినా ఛార్జర్ అవసరం తక్కువగా ఉంటుంది. 60వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వల్ల పెద్ద బ్యాటరీ అయినా త్వరగా ఫుల్ అవుతుంది. గేమింగ్ కోసం బ్రైట్ డిస్ప్లే, స్టేబుల్ పర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. ఐపీ69 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ ఉండటంతో బయట తిరిగేటప్పుడు కూడా టెన్షన్ ఉండదు. కెమెరా సోషల్ మీడియా యూజ్ కి తగినంత అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ ఫోన్ ధర సుమారుగా 25,000 నుంచి 30,000 మధ్య ఉండొచ్చు.

Read Also: Airtel Offer: సింగిల్ బిల్.. డబుల్ బెనిఫిట్.. ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్ స్పెషాలిటీ ఇదే

నథింగ్ ఫోన్ (3ఎ) కమ్యూనిటీ ఎడిషన్ (Nothing Phone (3a) Community Edition)

నథింగ్ ఫోన్ (3ఎ) కమ్యూనిటీ ఎడిషన్ పూర్తిగా డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ డిజైన్, గ్లిఫ్ లైట్స్ వల్ల ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది. ఇందులో 12జిబి రామ్ ఉండటంతో యాప్ స్విచింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది, 5జి కనెక్టివిటీ స్టేబుల్ గా పనిచేస్తుంది. క్లిన్ సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్ వల్ల అనవసర యాప్స్ లేకుండా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కెమెరా నేచురల్ కలర్స్ ఇస్తుంది, బ్యాటరీ డైలీ యూజ్ కి తగినంతగా ఉంటుంది. దీని అంచనా ధర 30,000 నుంచి 35,000 మధ్య ఉండే ఛాన్స్ ఉంది.

ధరలో ఏది బెస్ట్ ఫోన్?

మూడు 5జి ఫోన్లు మూడు రకాల యూజర్ల కోసం తయారయ్యాయి. కాంపాక్ట్ డిజైన్ ప్లస్ పర్‌ఫార్మెన్స్ కావాలంటే ఒప్పో రినో15ప్రో మినీ 5జి బెస్ట్, భారీ బ్యాటరీ బ్యాక్-అప్ ప్లస్ గేమింగ్ ఫోకస్ కావాలంటే రియల్‌మి నార్జో90 5జి సరైన ఛాయిస్, యూనిక్ లుక్ క్లిన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే నథింగ్ ఫోన్ (3ఎ) కమ్యూనిటీ ఎడిషన్ మంచి ఎంపిక. మీ అవసరం ఏంటో చూసుకుని ఈ మూడు ఫోన్లలో మీకు సరిపోయేదాన్ని ఎంచుకుంటే చాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News