Homeటెక్నాలజీSmartphones: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. భారీగా పెరిగిన ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

Smartphones: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. భారీగా పెరిగిన ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

A big shock for smartphone enthusiasts: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు భారీగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్‌ విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో, అగ్రగామి తయారీ సంస్థలన్నీ మొబైల్‌ ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే రియల్‌మీ, ఒప్పో, వివో, శామ్‌సంగ్, వన్‌ప్లస్‌ వంటి బ్రాండ్లు ఎంపిక చేసిన మోడళ్ల ధరలు పెంచగా.. ఈ ప్రభావం అమ్మకాలపై భారీగా పడింది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం.. 2026 ఏప్రిల్‌-జులై మధ్య స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా క్షీణింాయి. అయితే, ఆన్‌లైన్‌ స్పెషల్‌ సేల్స్‌లో ప్రత్యేక ఆఫర్లు ఉండే సమయంలో మాత్రం స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లు కాస్త పుంజుకోవడం కాస్త ఊరటనించే అంశం.

- Advertisement -

ఏ బ్రాండు ధరలు ఎంత పెరిగాయంటే

రియల్‌మీ

ఆగస్టు 18 నుంచి పలు మోడళ్లపై రూ. 1000-4 వేల వరకు ధరలు పెంచింది.

ఒప్పో

రెనో, ఏ-సిరీస్‌ ఫోన్లపై గరిష్ఠంగా రూ.5 వేల వరకు పెంచింది.

వివో

ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు రూ. 500 నుంచి 4 వేల వరకు ధరలను సవరించింది.

శామ్‌సంగ్‌

ఎస్‌-సిరీస్, ఎం-సిరీస్, ఎఫ్‌-సిరీస్‌ ఫోన్ల ధరలను పెంచింది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్‌25 వేరియంట్‌ ధరను రూ.12 వేలకు పెంచడంతో ఈ ఫోన్‌ మరింత ప్రియంగా మారింది.

వన్‌ప్లస్‌

ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లపై రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ధరలు పెంచుతూ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బిగ్‌ షాకిచ్చింది.

మరో 7-10% పెరిగే అవకాశం

మెమొరీ చిప తయారీ ఖర్చులు పెరగడంతో 2026 రెండో త్రైమాసికం నాటికే స్మార్ట్‌ఫోన్‌ సగటు ధరలు ఇప్పటికే దాదాపు 15% పెరిగాయని ఐడీసీ ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషి తెలిపారు. రాబోయే నెలల్లో మొబైల్‌ విడిభాగాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరో 7-10% పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కొత్తగా విడుదలకు సిద్ధమవుతున్న మొబైల్స్‌ కూడా అధిక ధర వద్ద మార్కెట్‌లోకి వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

పండగ విక్రయాలపైనే కొనుగోలుదార్ల ఆశలు

స్మార్ట్‌ఫోన్‌ ధరలు భారీగా పెరగడంతో, వినియోగదారులు ఆఫర్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జూలైలో అమెజాన్‌ ప్రైమ్‌ డే, ఫ్లిప్‌కార్ట్‌ గోట్‌ సేల్స్‌ వంటి పెద్ద ఆఫర్ల సమయంలోనే మొబైల్‌ కొనుగోళ్లు జరిగాయి. అయినప్పటికీ, మిగతా రోజుల్లో అమ్మకాలు మందగించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే దసరా, దీపావళి సీజన్లలో బ్యాంక్‌ ఆఫర్లు, ఈఎంఐలు, కంపెనీ-ఇకామర్స్‌ సంస్థల ప్రత్యేక తగ్గింపు ద్వారానే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News