Online Fraud Customer bought rs. 1.86 lakh Worth Smart Phone: ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాక.. చాలావరకు కొనుగోళ్లు స్మార్ట్‌ఫోన్‌లోనే జరిగిపోతున్నాయి. చిన్న గుండు సూది నుంచి టీవీలు, ఫ్రిజ్‌ల వరకు ఈ ప్లాట్‌ఫామ్‌లో కొనుగోలు చేయడం అలవాటైపోయింది. పదుల సంఖ్యలో ఆప్షన్లు ఉండటంతో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. అయితే ప్రొడక్ట్ ఇంటికి డెలివరీ వచ్చాకా.. ఒక్కోసారి కస్టమర్లు అందులోని వస్తువులను చూసి బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి. మనం కొన్న ఐటం కాకుండా అందులో సబ్బులు, ఇనుప కడ్డీలు.. సింపుల్‌గా చెప్పాలంటే చాలా చవకైన వస్తువులు చూసి నిలువునా మోసపోయారు. తాజాగా బెంగళూరుకి చెందిన టెకీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
ఆన్‌లైన్ డెలివరీ స్కామ్‌లో ఓ వ్యక్తి రూ.1.86లక్షలు పోగొట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో జరిగిన భారీ డెలివరీ ఫ్రాడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా స్మార్ట్ కస్టమర్లను షాకింగ్‌కు గురి చేసింది. యలచెనహళ్లికి చెందిన 43 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సుమారు రూ.1.86 లక్షలు విలువైన ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చాకా ఆ పార్సిల్‌ను తెరిచి చూస్తే అందులో ఫోన్‌కు బదులు ఒక పెంకు ముక్క రావడం చూసి ఖంగు తిన్నాడు.
Also Read: https://teluguprabha.net/technology-news/iqoo-neo-11-launched-in-china-check-price-and-features/
అక్టోబర్ 14న ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మోడల్‌ను రూ.1,86,000 చెల్లించి ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 19న అతనికి పార్సిల్ డెలివరీ కాగా.. ముందు జాగ్రత్త చర్యగా కస్టమర్ డెలివరీని అన్‌బాక్స్ చేసేటప్పుడు మొత్తం ప్రక్రియను వీడియో తీశాడు. అయితే, బాక్స్‌ను తెరిచి, అందులో ఉందని ఆశతో ఓపెన్ చేయగా… ఒక తెల్లటి టైల్ ముక్క కనిపించడంతో కస్టమర్ షాక్ అయ్యాడు.
వెంటనే కస్టమర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో, మోసపోయానని తెలుసుకుని.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు నమోదు చేశాక.. అనంతరం కుమార్ స్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు ఐటీ చట్టంతో పాటు సెక్షన్ 318(4) (మోసం), 319 (వ్యక్తిగతంగా మోసం చేయడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: https://teluguprabha.net/national-news/non-bs-6-commercial-vehicles-banned-in-delhi-from-tomorrow/
కస్టమర్ రికార్డు చేసిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, డెలివరీ ప్రక్రియలో ఎక్కడ మోసం జరిగిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. డెలివరీ సంస్థ, దాని అవుట్‌సోర్సింగ్ పార్ట్నర్, పార్సిల్ నిర్వహణలో పాల్గొన్న సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా, ఆన్‌లైన్ షాపింగ్‌లో జరుగుతున్న ఇలాంటి మోసాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు, తప్పనిసరిగా అన్‌బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయాలని స్పష్టం చేశారు.


