Acer Nitro Lite 16 Launched: ఏసర్ తన కొత్త ల్యాప్ టాప్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని ఏసర్ నైట్రో లైట్ 16 పేరిట తీసుకొచ్చింది. గేమర్స్, విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించిన ఈ కొత్త ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌లు, 6GB వీడియో మెమరీతో Nvidia GeForce RTX 4050 GPUతో వస్తుంది. అయితే, ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Acer Nitro Lite 16 ధర:
ఇండియాలో ఏసర్ నైట్రో లైట్ 16 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i5-13420H CPU, 16GB RAM కలిగిన బేస్ మోడల్ ధర రూ.69,990 నుండి ప్రారంభమవుతుంది. అదే ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్‌తో కూడిన మరొక వేరియంట్ ధర రూ..79,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఒకే పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. కాగా, ఇది ఏసర్ రిటైల్ స్టోర్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
Acer Nitro Lite 16 ఫీచర్లు:
విండోస్ 11తో వస్తోన్న ఏసర్ నైట్రో లైట్ 16 ల్యాప్‌టాప్ 16-అంగుళాల WUXGA (1,920×1,200 పిక్సెల్‌లు) IPS LCD స్క్రీన్‌ను 165Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్, RTX 4050 GPU వరకు వస్తుంది. ఇది 6GB GDDR6 VRAM, 16GB వరకు DDR5 RAM అదేవిధంగా 512GB SSD నిల్వను కలిగి ఉంటుంది.
Also Read: Laptops under 13K: పిచ్చెక్కించే ఆఫర్స్..కేవలం రూ.13 వేల కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు..
ఈ ల్యాప్‌టాప్ రెండు స్టీరియో స్పీకర్లు, పూర్తి-HD కెమెరాతో పాటు గోప్యతా షట్టర్‌ను కలిగి ఉంది. ఏసర్ నైట్రో లైట్ 16 ల్యాప్‌టాప్ Wi-Fi 6, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. దీనికి ఒక USB 3.2 Gen A పోర్ట్, ఒక USB 3.2 పోర్ట్, ఒక Thunderbolt 4 పోర్ట్, ఒక ఈథర్నెట్ పోర్ట్, ఒక HDMI 2.1 పోర్ట్ ఒక కాంబో ఆడియో జాక్ ఉన్నాయి. ఏసర్ నైట్రో లైట్‌లో ప్రత్యేకమైన కోపైలట్ కీతో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను అందించింది. ఇది 100W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 53Wh బ్యాటరీని కలిగి ఉంది. దీని కొలతలు 362.2×248.47×22.9mm. దీని బరువు 1.95kg.


