Acerpure Nitro Z Series 100 Inch Qled Tv Launched: ప్రముఖ టెక్ బ్రాండ్ ఏసర్ గ్రూపులో భాగమైన ఏసర్‌ప్యూర్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో కొత్త నైట్రో Z సిరీస్ 100-అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఈ టీవీని అధునాత ఫీచర్లతో ప్రత్యేకంగా గేమర్స్, సినిమా ప్రియుల కోసం రూపొందించారు. ఇప్పుడు ఈ టీవీ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఏసర్‌ప్యూర్ నైట్రో Z సిరీస్ 100-అంగుళాల QLED టీవీ ధర:
ఇండియాలో ఏసర్‌ప్యూర్ నైట్రో Z సిరీస్ 100-అంగుళాల QLED టీవీ ధర రూ.259,999గా ఉంది. ఈ టీవీ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఈ టీవీ లాంచ్ తో ఏసర్‌ప్యూర్ సంస్థ భారతీయ మార్కెట్లో ప్రీమియం QLED సెగ్మెంట్‌లో పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
ఏసర్‌ప్యూర్ నైట్రో Z సిరీస్ 100-అంగుళాల QLED టీవీ ఫీచర్లు:
ఏసర్‌ప్యూర్ నైట్రో Z సిరీస్ 100-అంగుళాల QLED TV గూగుల్ టీవీలో నడుస్తుంది. ఇది వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వివిధ రకాల యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ కొత్త టీవీ 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 100-అంగుళాల QLED ప్యానెల్‌ను కలిగి ఉంది. దీని డిస్ప్లే 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మెరుగైన విజువల్స్ కోసం డాల్బీ విజన్, HDR10 కంటెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఇక ఆడియో పరంగా ఈ టీవీ 60W ఆడియో అవుట్‌పుట్‌ను అందించే డాల్బీ అట్మాస్-పవర్డ్ స్పీకర్‌లను కలిగి ఉంది. పనితీరు పరంగా ఈ మోడల్‌లో 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది మల్టీ టాస్కింగ్, యాప్‌లు లేదా మీడియాను స్టోర్ చేయడం సులభం చేస్తుంది.
గేమింగ్ కోసం..ఏసర్‌ప్యూర్ నైట్రో Z సిరీస్ 100-అంగుళాల QLED TV ఆటో లో-లేటెన్సీ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఇవి లాగ్, మోషన్ బ్లర్‌ను తగ్గించి గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ కొత్త టీవీ ఫిలిం మేకర్ మోడ్ లను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ ద్వారా యూజర్లు తమకు నచ్చిన యాప్‌లు, కంటెంట్ రికమెండేషన్లు, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ వంటి సౌకర్యాలను పొందవచ్చు. కనెక్టివిటీ పరంగా..ఇది డ్యుయల్ వై-ఫై సపోర్ట్‌తో పాటు HDMI, USB పోర్టులు కలిగి ఉంది. ఇంకా సింగిల్ రిమోట్ కంట్రోల్ ద్వారా అనేక డివైస్‌లను సులభంగా నిర్వహిస్తుంది.


