Friday, March 13, 2026
Homeటెక్నాలజీAI Plus Pulse 2: భారత మార్కెట్లోకి 'పల్స్ 2' ఎంట్రీ.. రూ. 5,999 కే...

AI Plus Pulse 2: భారత మార్కెట్లోకి ‘పల్స్ 2’ ఎంట్రీ.. రూ. 5,999 కే 6000mAh భారీ బ్యాటరీ ఫోన్

AI Plus Pulse 2: ప్రస్తుతం మార్కెట్‌లో మిడ్ రేంజ్ ఫోన్‌లకు డిమాండ్ మరింత పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్, మంచి బ్యాటరీ బ్యాకప్, క్లియర్ కెమెరా, అప్‌డేటెడ్ లుక్ కోరుకునే యూజర్‌లు ఎక్కువవుతున్నారు. అదే అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐ ప్లస్ కంపెనీ పల్స్ 2 ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా రోజువారీ వాడకానికి తగినంత పర్‌ఫార్మెన్స్, ఎక్కువసేపు కొనసాగే బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే కోరుకునే వారికి సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

- Advertisement -

డిస్‌ప్లే విషయానికి వస్తే, పల్స్ 2లో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ స్పీడ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్, సాధారణ గేమింగ్ సమయంలో ల్యాగ్ తక్కువగా అనిపిస్తుంది. ఈ ఫోన్‌లో యూనిసాక్ టి7250 ఆక్టా కోర్ చిప్‌సెట్ ఇచ్చారు. ఇది రోజువారీ యాప్‌లు రన్ చేయడానికి తగినంత సామర్థ్యాన్ని అందిస్తుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు లభిస్తాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశం ఉంది.

సాఫ్ట్‌వేర్ పరంగా ఎన్‌ఎక్స్‌టీక్యూ ఓఎస్ ఆధారంగా ఆండ్రాయిడ్ 16పై ఈ ఫోన్ నడుస్తుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ సింపుల్‌గా ఉండేలా డిజైన్ చేశారు. అవసరమైన సెక్యూరిటీ ఫీచర్స్ కూడా అందించారు. రోజువారీ ఉపయోగంలో యాప్ ఓపెనింగ్ స్పీడ్, మల్టీటాస్కింగ్ అనుభవం తగినంత స్థాయిలో ఉంటుంది. డివైస్ డిజైన్ కూడా స్లీక్‌గా, అప్‌డేటెడ్ లుక్‌తో కనిపిస్తుంది.

Read Also: BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్ హోలీ ధమాకా.. ఒక్క రీచార్జ్‌తో 164 రోజుల వ్యాలిడిటీ

కెమెరా సెగ్మెంట్‌లో 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోటోలు క్లియర్‌గా రావడానికి ఏఐ సపోర్ట్ ఉపయోగపడుతుంది. ఎఫ్‌హెచ్‌డీ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్, సోషల్ మీడియా పోస్టుల కోసం ఇది సరిపోతుంది. డేలైట్ ఫోటోగ్రఫీలో మంచి డీటెయిల్స్ కనిపిస్తాయి.

బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన బలం. 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం వల్ల ఎక్కువసేపు వాడుకునే అవకాశం ఉంటుంది. సాధారణ వాడకంలో ఒక రోజు కంటే ఎక్కువ బ్యాకప్ రావచ్చు. 10డబ్ల్యూ ఛార్జర్ బాక్స్‌లోనే అందిస్తున్నారు. సింగిల్ స్పీకర్ ద్వారా తగినంత సౌండ్ అవుట్‌పుట్ లభిస్తుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ధర విషయానికి వస్తే, 4జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.5,999గా ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.7,999గా నిర్ణయించారు. మార్చి11 మధ్యాహ్నం 12గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. తక్కువ ధరలో భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే కోరుకునే మిడ్ రేంజ్ యూజర్‌లకు పల్స్ 2 మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News