Homeటెక్నాలజీAI Effect: ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.. ఇకపై ఫ్రెషర్స్‌కు గడ్డు కాలమే.. సర్వేలో సంచలన విషయాలు

AI Effect: ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.. ఇకపై ఫ్రెషర్స్‌కు గడ్డు కాలమే.. సర్వేలో సంచలన విషయాలు

AI threatens entry level jobs: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్‌ ప్రపంచంలో పెను మార్పులకు కారణమవుతోంది. ఏఐ రాకతో ఎంట్రీ-లెవల్‌ వైట్‌-కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు పొంది ఉందని ఇప్పటికే అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంతేకాదు, ఏఐ రాకతో అనేక టెక్‌ కంపెనీలు లేఆఫ్స్‌ను ప్రకటిస్తూ ఐటీ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా, ఏఐపై జరిపిన మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ది న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజి-ఆలీవర్‌ వైమన్‌ ఫోరమ్‌ సర్వే నివేదిక చేసిన అధ్యయనం ప్రకారం, ఏఐ ఎంట్రీతో భవిష్యత్తులో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితి కనిప్తోంది. దాదాపు 415 మంది సీఈఓలను సర్వే చేసి, ఈ నివేదిక రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది సీఈఓలు ఇకపై ఎంట్రీ-లెవల్‌ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టడానికి సుముఖంగా లేరని సర్వే వెల్లడించింది. దీంతో గతంలో సులభంగా దొరికిన ఉద్యోగాలు భవిష్యత్తులో లభించకపోవచ్చని స్పష్టం చేసింది. ఐఐటీల్లో, ఇతర టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో వచ్చే ఈజీ జాబ్స్‌ గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

- Advertisement -

Also read: AI Affect: ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.. ఇకపై ఫ్రెషర్స్‌కు గడ్డు కాలమే.. సర్వేలో సంచలన విషయాలు

మాయం కానున్న ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పటికే అనేక సాధారణ ఎంట్రీ-లెవల్ పనులను క్షణాల్లో చక్కబెడుతున్నందున.. కంపెనీలు ఫ్రెషర్స్‌ నియామకాలను గణనీయంగా తగ్గించనున్నాయి. ఫ్రెషర్స్‌కు బదులుగా అనుభవజ్ఞులైన ఉద్యోగులపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. కోడ్‌ రాయడం, డాక్యుమెంట్‌లను విశ్లేషించడం, రిపోర్టులు రూపొందించడం, కస్టమర్ సపోర్ట్ వంటి వాటిల్లో ఏఐను ఉపయోగించడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఎన్ని పనులు చేసినప్పటికీ విచక్షణతో నిర్ణయాలు తీసుకోవడం, వాస్తవ సమస్యలను అర్థం చేసుకోవడంలో ఏఐ (ఏఐ) ఇబ్బంది పడుతోంది. దీంతో కృత్రిమ మేధను పర్యవేక్షించే బాధ్యతలను అనుభవజ్ఞులైన ఉద్యోగులకు అప్పగించడానికి ఎగ్జిక్యూటివ్‌లు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. కేవలం ఏఐ టూల్స్‌తో అన్ని చెక్కబెట్టడం సాధ్యం కాదని వారు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News