Friday, February 13, 2026
Homeటెక్నాలజీAI Job Loss: రాబోయే పదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలకు ఎసరు.. AI ధాటికి ఆ...

AI Job Loss: రాబోయే పదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలకు ఎసరు.. AI ధాటికి ఆ రంగాలు కనుమరుగు!

AI to Displace 3 Million Jobs in Next Decade: టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో ఒక చేదు వార్త ఇప్పుడు ఉద్యోగ వర్గాలను కలవరపెడుతోంది. రాబోయే దశాబ్ద కాలంలో కృత్రిమ మేధ  (Artificial Intelligence) (AI), ఆటోమేషన్ కారణంగా దాదాపు 30 లక్షల ఉద్యోగాలు (3 Million Jobs) గల్లంతయ్యే (AI Job Loss) ప్రమాదం ఉందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (NFER) తన తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమేనని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

- Advertisement -

ALSO READ: Made-in-India: దేశీయ విమానయాన రంగంలో నూతన శకం: గగన వీధుల్లోకి ‘హంస-3’ రెడీ!

ప్రమాదంలో ఉన్న రంగాలు ఇవే

ఈ ముప్పు అన్ని రంగాలపైనా ఒకేలా లేదు. ముఖ్యంగా రొటీన్ పనులు జరిగే రంగాలపై AI పంజా విసరనుంది. అడ్మినిస్ట్రేషన్ (Administration), సెక్రటేరియల్ పనులు, కస్టమర్ సర్వీస్ (Customer Service), మెషీన్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని పరిశోధకులు తేల్చిచెప్పారు. గతంలో ఊహించిన దానికంటే మూడు రెట్లు వేగంగా ఈ మార్పులు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. అంటే, మనం కళ్లు తెరిచేలోపే రోబోలు మనుషుల కుర్చీలను ఆక్రమించేస్తాయి అన్నమాట.

యువతకు ఇదో హెచ్చరిక

కేవలం ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికే కాదు, చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న యువతకు కూడా ఇది గట్టి సవాలు. అవసరమైన నైపుణ్యాలు, డిగ్రీలు లేకుండా బయటకు వచ్చే యువతకు ‘గ్రోత్ ఆక్యుపేషన్స్’ (అభివృద్ధి చెందుతున్న రంగాలు)లో చోటు దొరకడం కష్టమే. ఇది ముమ్మాటికీ “అంతరించిపోతున్న ఉద్యోగాల” జాబితాలో వారిని చిక్కుకునేలా చేస్తుంది.

కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

అయితే, చీకటిలో వెలుగు రేఖలా ఒక పరిష్కారం కూడా ఉంది. యంత్రాలు చేయలేని పనుల్లో మనుషులు నిష్ణాతులు కావాలి. వీటిని నివేదిక “ఎసెన్షియల్ ఎంప్లాయిమెంట్ స్కిల్స్”గా పేర్కొంది. అవేంటంటే:

  • సృజనాత్మక ఆలోచన (Creative Thinking)

  • సమస్యల పరిష్కారం (Problem Solving)

  • కమ్యూనికేషన్ (Communication)

  • టీమ్ వర్క్ (Collaboration)

  • నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం (Decision Making)

2035 నాటికి సైన్స్, ఇంజనీరింగ్, న్యాయ (Legal) రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, అయితే అక్కడ నెగ్గుకురావాలంటే పైన చెప్పిన నైపుణ్యాలు తప్పనిసరి అని నివేదిక స్పష్టం చేసింది.

దిగ్గజ సంస్థల్లో ఇప్పటికే మొదలైన కోతలు

ఇది కేవలం అంచనా మాత్రమే కాదు, ఇప్పటికే దిగ్గజ కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉదాహరణకు, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి సంస్థలు సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో AIని వాడుతూ ఉద్యోగాల్లో మార్పులు చేస్తున్నాయి. అమెజాన్ వంటి సంస్థలు కూడా AI టూల్స్ నిర్వహణ వైపు మొగ్గు చూపుతూ, సాధారణ ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. కాబట్టి, ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, యజమానులు కలిసికట్టుగా పనిచేసి, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించకపోతే, భవిష్యత్తులో తీవ్ర నిరుద్యోగ సమస్య తప్పదని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

ALSO READ: Surveillance: సోషల్ మీడియాలో ‘సెర్చ్’… రోగాలపై ‘వార్’! – వ్యాధుల కట్టడికి ఎన్‌సీడీసీ సరికొత్త అస్త్రం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News