AWS CEO Matt Garman soft skills Advice : అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సీఈఒ మ్యాట్ గార్మన్ AI యుగంలో విజయం సాధించాలంటే కోడింగ్ లేదా టెక్ స్కిల్స్ మీద మాత్రమే ఆధారపడకూడదని స్పష్టం చేశారు. కొలేజీలో క్రిటికల్ థింకింగ్ (విమర్శనాత్మక ఆలోచన), అడాప్టబిలిటీ (స్థితిగతులకు తగ్గట్టు మార్చుకోవడం), కమ్యూనికేషన్ (మాట్లాడటం, వినడం) వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను బలోపేతం చేయాలని తెలిపారు. “కోలేజీలో ఏ సబ్జెక్ట్ చదివినా క్రిటికల్ థింకింగ్‌ను అభివృద్ధి చేయండి. ఇది AI యుగంలో అత్యంత ముఖ్యమైన స్కిల్” అని గార్మన్ తెలిపారు.
“AI రోబోటిక్ వర్క్‌లు, డేటా ప్రాసెసింగ్ వంటివి సులభంగా చేస్తుంది. కానీ సృజనాత్మకత, సమస్యలను విశ్లేషించి పరిష్కారాలు కనుగొనడం, మార్పులకు సర్దుకోవడం వంటివి మానవులే చేయగలరు. క్రిటికల్ థింకింగ్ AI యుగంలో నంబర్ వన్ స్కిల్. సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ముఖ్యం” అని ఆయన వివరించారు. హై స్కూల్ చదువుతున్న తన కుమార్తెకు కూడా ఇదే సలహా ఇస్తానని తెలిపారు.
AI జూనియర్ జాబ్‌లను తీసుకుంటుందని కొందరు భయపడుతున్నారు. కానీ గార్మన్ ప్రకారం, “అది తప్పు.. AI జూనియర్ స్టాఫ్‌ను రీప్లేస్ చేయడం జరిగే పని కాదు.. ముందు అనవసర ఆలోచనలు మాని స్కిల్స్ పెంచుకోవటం పైన దృష్టి పెట్టండి” అని చెప్పారు. మానవులు AIని ఉపయోగించి మరింత బెటర్ పని చేయాలని సూచించారు.
ఇక ఈయన మాత్రమే కాదు, ఇతర నిపుణులు కూడా ఇలాంటి సలహాలే చెబుతున్నారు. జోహో కార్ప్ AI రీసెర్చ్ డైరెక్టర్ రామ్‌ప్రకాశ్ రామమూర్తి, “AI యుగంలో క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ మానవుల బలం. జాబ్‌లు మారతాయి, కానీ మన స్కిల్స్ AIతో కలిసి పని చేయాలి” అని తెలిపారు. ఇండియాలో కూడా, కిరన్ మజుందార్-షా వంటి బిజినెస్ లీడర్లు సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి పెట్టమని సూచిస్తున్నారు. ఉదాహరణకు, కమ్యూనికేషన్ స్కిల్‌తో AI రిపోర్ట్‌లను సులభంగా వివరించి, టీమ్‌లను లీడ్ చేయవచ్చు. అడాప్టబిలిటీతో కొత్త టూల్స్ త్వరగా నేర్చుకోవచ్చు అని వివరించారు.
కాలేజీలో ఈ స్కిల్స్ ఎలా బలోపేతం చేయాలి? డిబేట్స్, గ్రూప్ ప్రాజెక్ట్స్, రీడింగ్, పాడ్‌కాస్ట్‌లు వాడండి. AI టూల్స్‌ను ఉపయోగించి క్రిటికల్ థింకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒక డిగ్రీతో మాత్రమే సరిపోదు, లెర్నింగ్ టు లెర్న్ (నేర్చుకోవడం నేర్చుకోవడం) ముఖ్యం అని వివరించారు. సో ఏఐ రంగంలో సైతం సాఫ్ట్ స్కిల్స్ తప్పనిసరి అనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.


