Amazon Bumper Offer on Google Pixel8 Smart Phone: టెక్ దిగ్గజం గూగుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనూ దూసుకుపోతుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్లతో మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అయితే, వీటి ధర కాస్త ఎక్కువగా ఉండటంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అటువంటి వారి కోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ అదిరే ఆఫర్ తీసుకొచ్చింది. అమెజాన్ ప్లాట్‌ఫామ్ గూగుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.
గూగుల్ పిక్సెల్ 8 ధర, ఆఫర్
గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ 2023 అక్టోబర్‌లో రిలీజైంది. విడుదలతోనే భారీ అమ్మకాలతో సంచలనాలు సృష్టించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.75,999 ధర వద్ద మార్కెట్‌లోకి వచ్చింది. ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌లో దీన్ని కేవలం రూ.38,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిపై భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% డిస్కౌంట్ (రూ.3,000 వరకు) లభిస్తుంది. డిస్కౌంట్ అనంతరం దీన్ని కేవలం రూ.35,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.40,500 తగ్గింపు లభిస్తుంది. అలాగే మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింతగా ఆదా చేసుకోవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్లు
గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్స్‌తో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ టెన్సర్ జీ3 ఆధారిత టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 8లో 50 మెగాపిక్సెల్ ఆక్టా- పీడీ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 10.5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 4575mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.


