Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSmartPhones: అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌..ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!

SmartPhones: అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌..ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!

Amazon Great Freedom Sale: ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతోంది. ఇందులో అనేక స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో స్మార్ట్‌ఫోన్ల వాస్తవ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. అలాగే, ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాకింగ్ ఆఫర్‌లతో సహా అనేక రకాల డిస్కౌంట్‌లు ఉన్నాయి. దీనితో, ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్, మిడ్-బడ్జెట్, ప్రీమియంతో సహా అన్ని వర్గాల స్మార్ట్‌ఫోన్‌లను ఈ సేల్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉత్తమ డీల్‌లను తెలుసుకుందాం.

- Advertisement -

 

ONEPLUS 13R

వన్ ప్లస్ 13R స్మార్ట్ AI, శక్తివంతమైన లక్షణాలతో కూడిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఈ పరికరం 6.78-అంగుళాల బిగ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1 నుండి 120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ తో వస్తుంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది పూర్తి రోజు బ్యాకప్‌ను అందిస్తుంది. దీని వెనుక భాగంలో 50MP SONY LYT-700 OIS కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ధర దాదాపు రూ. 39,999.

 

IQOO NEO 10R 5G

ఈ స్మార్ట్ ఫోన్ పవర్‌ప్యాక్డ్ బ్యాటరీతో కూడిన స్లిమ్ ఫోన్. 1.5K 144Hz AMOLED డిస్‌ప్లే ఉంది. దీనికి స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అమర్చారు. ఇందులో 8GB RAM, 128GB నిల్వ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలోనే అత్యంత సన్నని 6400mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్. ఇది 0.798cm అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 50MP సోనీ IMX882 OIS కెమెరాను కలిగి ఉంది. ఇది గొప్ప ఫోటో, వీడియో నాణ్యతతో వస్తుంది. దీని రూ. 26,998కే కొనుగోలు చేయొచ్చు.

Also Read: Laptops Under 30K: రూ. 30 వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు కొనాలా..?అయితే, వీటిపై ఓ లుక్కేయండి..!

REALME NARZO 80 PRO 5G

ఈ పరికరం గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఉత్తమం. దీని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో రూ.20,498కే కొనుగోలు చేయొచ్చు. 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ బిగ్ 6000mAh బ్యాటరీతో 80W ఆస్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

 

ONEPLUS NORD CE5

ఈ ఫోన్ 6.77-అంగుళాల బిగ్ అమోలేడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ AI-ఎనేబుల్డ్ ఫీచర్లు AI బెస్ట్ ఫేస్, AI ఎరేజర్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ పరికరం 7100mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 నుండి 3 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే, 10 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటల బ్యాకప్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ గేమింగ్ కోసం 120fps రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. దీనిలో 50MP సోనీ OIS కెమెరా ఉంది. దీని ధర రూ. 24,998 కు కొనుగోలు చేయొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad