Amazon Great Freedom Sale: మీరు చాలారోజులుగా బిగ్ స్క్రీన్ టీవీ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే, బడ్జెట్ విషయంలో ఆందోళన చెందుతుంటే, మీకో గుడ్ న్యూస్. ప్రస్తుతం అమెజాన్ లో ఫ్రీడమ్ సేల్ జరుగుతోంది. ఇందులో అనేక టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే కేవలం రూ. 20,000 కంటే తక్కువ ధరకే శక్తివంతమైన, స్మార్ట్ 43 అంగుళాల టీవీని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్‌లో మార్కెట్‌లోని అగ్ర బ్రాండ్‌ల టాప్-5 మోడల్‌లు ఉన్నాయి. ఇవి గొప్ప స్క్రీన్ నాణ్యత, అద్భుతమైన ఫీచర్లతో వస్తుండడం విశేషం. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఏ టీవీ ఉత్తమంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
Blaupunkt CyberSound G2 Series (43 inch) Full HD LED Smart Android TV
బ్లూపంక్ట్ నుండి 43-అంగుళాల సైబర్‌సౌండ్ G2 సిరీస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 2023 ఎడిషన్ ధర కేవలం ₹ 16,959. అతి తక్కువ ధరకే లభించే ఈ టీవీ ఫుల్ HD రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ డిజిటల్ ప్లస్ తో 48W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. చవక ధరలో ఈ టీవీ అత్యుత్తమ ఆడియో-వీడియో అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB పోర్ట్‌లు, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Google అసిస్టెంట్ మద్దతు వంటి అన్ని ముఖ్యమైన స్మార్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది 1-సంవత్సరం వారంటీతో వస్తుంది.
acer (43 inches) G Plus Series 4K Ultra HD LED Smart Google TV
కేవలం రూ. 20000 కు ఏసర్ 43 అంగుళాల జి ప్లస్ సిరీస్ 4 కె అల్ట్రా హెచ్‌డి స్మార్ట్ గూగుల్ టీవీని కొనుగోలు చేయొచ్చు. ఇది 4 కె అల్ట్రా హెచ్‌డి రిజల్యూషన్, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ దాని ధర కంటే ఎక్కువ ఫీచర్లతో వస్తోంది. గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్, 2GB RAM, 16GB స్టోరేజ్, వాయిస్ రిమోట్‌తో, ఈ స్మార్ట్ టీవీ వినోద అవసరాలను తీరుస్తుంది. దీనితో పాటు, డాల్బీ అట్మాస్ సౌండ్, PRO ట్యూన్డ్ స్పీకర్లు మీకు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయి. అయితే, ఇది 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది.
Redmi Xiaomi (43 inch) F Series Ultra HD 4K LED Smart Fire TV
కేవలం రూ. 21,000 ధరకు ప్రీమియం స్మార్ట్ టీవీని కోరుకునే వినియోగదారులకు రెడ్ మి 43-అంగుళాల F సిరీస్ అల్ట్రా HD 4K స్మార్ట్ ఫైర్ టీవీ గొప్ప ఎంపిక. ఈ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD రిజల్యూషన్, డాల్బీ ఆడియో, DTS వర్చువల్: X వంటి ఆడియో ఫీచర్‌లతో అద్భుతమైన స్క్రీన్, సౌండ్ ఎక్సీపీరియెన్స్ అందిస్తుంది. ఇది 2GB RAM, 8GB అంతర్గత నిల్వను కూడా కలిగి ఉంది. మెటల్ బెజెల్-లెస్ డిజైన్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మద్దతు దీనికి ప్రీమియం లుక్, కనెక్టివిటీని ఇస్తుంది. ఫైర్ టీవీ అంతర్నిర్మిత, అలెక్సా వాయిస్ రిమోట్ మరియు 12,000+ యాప్‌లకు మద్దతు దీనిని పూర్తిగా స్మార్ట్‌గా చేస్తుంది. అలాగే, కంపెనీ ప్యానెల్‌పై 1 సంవత్సరం అదనపు వారంటీని కూడా అందిస్తుంది.
Onida 108 cm (43 inch) Full HD Smart TV
సరసమైన ధరలో 43 అంగుళాల టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి Onida 43 అంగుళాల పూర్తి HD స్మార్ట్ టీవీ (మోడల్ 43ACF) ఉత్తమం. దీని ధర రూ.17,499. ఒక సంవత్సరం బ్రాండ్ వారంటీతో, ఈ టీవీ ఈ బడ్జెట్‌లో మంచి పనితీరును అందిస్తుంది. ఈ టీవీ ఫుల్ HD రిజల్యూషన్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 20W బాక్స్ స్పీకర్లతో సౌండ్ తో వస్తుంది. దీనికి కూలిటా టీవీ OS, CC Cast, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ప్రసిద్ధ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం..2 HDMI, 1 USB పోర్ట్‌లు అందించారు.
నోట్: స్మార్ట్ టీవీలపై ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


