Saturday, November 15, 2025
HomeTop StoriesAmazon Great Indian Festival Sale: పండుగ వేళ అమెజాన్‌ ఆఫర్ల వర్షం.. సగానికి...

Amazon Great Indian Festival Sale: పండుగ వేళ అమెజాన్‌ ఆఫర్ల వర్షం.. సగానికి పైగా తగ్గనున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల లిస్ట్‌ ఇదే..!

Amazon Great Indian Festival Sale: రానున్న దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌ అమెజాన్ ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 పేరిట సెప్టెంబర్ 23 నుంచి సేల్‌ నిర్వహించనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న కస్టమర్లకి సెప్టెంబర్‌ 22 అర్థరాత్రి నుంచే సేల్‌ అందుబాటులోకా రానుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌పై కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఆడియో గాడ్జెట్లు, యాక్సెసరీస్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ సేల్లో ఏ ఏ గాడ్జెట్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు..

స్మార్ట్‌ఫోన్ విభాగంలో Samsung Galaxy S24 Ultra 5G కేవలం రూ.71,999 నుండి, iPhone 15 రూ.45,249 నుండి, OnePlus 13R రూ.35,999కి లభిస్తుంది. అలాగే iQOO Neo 10R, Redmi A4 5G, realme Narzo 80 Lite, Samsung Galaxy M36 5G, OnePlus Nord CE5, iQOO Z10R, Redmi 13 5G Prime Edition వంటి మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. ఇక, ఆడియో గాడ్జెట్ల విషయానికి వస్తే.. OnePlus Buds 4 కేవలం రూ.4,769 వద్ద, Samsung Galaxy Buds3 Pro రూ.10,999 వద్ద, boAt Airdopes 311 రూ.895 వద్ద, Noise Buds N1 రూ.799 వద్ద, boAt Airdopes 121 Pro Plus రూ.1,099 వద్ద అందుబాటులో ఉంటుంది. అలాగే ఛార్జర్లు, కేబుల్స్, పౌచులు వంటి యాక్సెసరీస్ రూ.99 నుండి ప్రారంభమవుతున్నాయి. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల విభాగం విషయానికి వస్తే.. HP 15 Ryzen 7 ల్యాప్‌టాప్ రూ.58,990కి, HP Victus Gaming Laptop (i7 Processor) రూ.99,990కి, ASUS TUF A16 రూ.87,990కి లభిస్తుంది. టాబ్లెట్లలో Samsung Galaxy Tab S9 FE రూ.26,999కి, Redmi Pad 2 రూ.13,999కి అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా Samsung Galaxy Watch 6 Classic రూ.15,999కి, Sony Alpha ILCE-7M4K కెమెరా రూ.1,96,990కి, Apple Pencil Pro రూ.10,399కి, boAt Aavante Prime 5.1 Soundbar రూ.11,999కి లభిస్తోంది. ఈ భారీ ఆఫర్లతో పాటు ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే పేమెంట్లపై అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు, అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రైమ్ యూజర్లకు 5% క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ యూజర్లకు 3% క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంతేకాకుండా, అమెజాన్‌ పే లేటర్‌ ద్వారా ఫ్లెక్సిబుల్ నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad