Sunday, November 16, 2025
Homeటెక్నాలజీAmazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్..యాపిల్, శాంసంగ్, వన్‌‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్...

Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్..యాపిల్, శాంసంగ్, వన్‌‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే!

Amazon Prime Day Discounts: ఆఫర్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. జూలై 12 నుండి జూలై 14 వరకు జరిగే ఈ సేల్‌లో వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్, అనేక బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్లు పొందొచ్చు. అమెజాన్ సేల్ సమయంలో క్రెడిట్ కార్డులపై కూడా చాలా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా తక్షణ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. పొందుతారు. డబ్బు ఆదా చేయడంలో సహాయపడే ఉత్తమ ఫోన్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

కార్డ్ ఆఫర్లు

ICICI క్రెడిట్ కార్డ్ లేదా SBI క్రెడిట్ కార్డ్ ఉంటే, చాలా ప్రయోజనాలు పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ICICI క్రెడిట్ కార్డ్‌పై రూ. 2000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక అయితే SBI క్రెడిట్ కార్డ్ రూ. 750 వరకు తగ్గింపును పొందొచ్చు.

 

Samsung Galaxy S24 Ultra 5G

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 74,999 (12GB+256GB)కి సొంతం చేసుకోవచ్చు.ఈ పరికరం పై దాదాపు రూ. 52,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇచ్చారు. దీనితో పాటు, ఈ స్మార్ట్ ఫోన్ పై 3000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా నో కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 200MP కెమెరా సెటప్ ఉంటుంది. 6000mAh బ్యాటరీ తో వస్తుంది.

 

Also Read:Infinix Hot 60 5G+: అదిరే గేమింగ్ ఫీచర్లతో హాట్ 60 5G+ విడుదల..ధర కూడా తక్కువే!

OnePlus 13R

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో OnePlus 13R పై రూ. 35,900 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. సేల్ సమయంలో ఈ పరికరం 12GB + 256GB వేరియంట్ ధర రూ. 42,999కే కొనుగోలు చేయొచ్చు. దాదాపు 6 నెలల నో కాస్ట్ EMI సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అలాగే, రూ. 4299 విలువైన ఈ OnePlus బడ్స్ 3 ఉచితంగా అందిస్తారు. పనితీరు కోసం.. ఈ మొబైల్ లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇన్‌స్టాల్ చేశారు. 6000mAh బ్యాటరీతో వస్తుంది. పరికరం వెనుక భాగంలో 50MP + 50MP 8MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే దాని ముందు భాగంలో 16MP కెమెరా అందించారు.

 

ఐఫోన్ 16

అమెజాన్ ప్రైమ్ డేలో ఆపిల్ ఐఫోన్ 16ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 46,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. దీనితో పాటు, ఈ ఫోన్‌పై రూ. 7000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ధర రూ. 79,900. కానీ, డిస్కౌంట్ తర్వాత దీన్ని రూ. 72,900 కు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. పనితీరు కోసం..ఈ ఫోన్ A18 చిప్‌ను అమర్చారు.

 

Also Read: Flipkart goat sale: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌..ఆపిల్ ఐఫోన్ 16, శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై ఖతర్నాక్ డిస్కౌంట్‌లు..

OnePlus 13

Oneplus 13 కొనుగోలుపై ఉత్తమ ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఫోన్ పై రూ.47,150 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ.72,999. అయితే, సేల్ సమయంలో ఈ ఫోన్ ను రూ.64,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కు 9 నెలల వరకు నో కాస్ట్ EMI సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ పరికరం 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ముందు భాగంలో 16 MP కెమెరా ఉంటుంది.

 

IQOO, Oppo

IQOO Z10x 5G స్మార్ట్ ఫోన్ ను రూ.13,498కే కొనుగోలు చేయవచ్చు, ఈ ఫోన్ పై రూ.12750 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై రూ.750 వరకు నో కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది బడ్జెట్ ధరలో వస్తున్న ఈ మొబైల్ మంచి ఫీచర్లను కలిగి ఉంది. ప్రైమ్ అమెజాన్ డే సేల్‌లో ఒప్పో A3X 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12,499 కు కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఫోన్‌కు నో కాస్ట్ EMI, రూ. 750 క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad