Amazon prime Lite Subscription: ఇష్టమైన వెబ్ సిరీస్‌లను చూడాలనుకున్నా లేదా సినిమా చూడాలనుకున్నా OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు ఉత్తమ ఎంపికగా మారాయి. అయితే వాటికి సభ్యత్వాన్ని పొందడానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సరైన రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేస్తే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జియో హాట్ స్టార్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సభ్యత్వం ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే, అమెజాన్ ప్రైమ్ లైట్ ఉచిత సభ్యత్వాన్ని పొందాలని చూస్తున్నారా..? ఈ సభ్యత్వం జియో, ఎయిర్‌టెల్, Vi అనేక ప్లాన్‌లతో ఉచితంగా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ ఉచిత అమెజాన్ ప్రైమ్ ప్లాన్‌లు
ఉచిత అమెజాన్ ప్రైమ్ లైట్ సభ్యత్వం కోసం ఎయిర్‌టెల్ రూ.1199 ధర గల ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీనిలో 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందొచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు, ప్రతిరోజూ 100 SMSలను పంపవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
జియో ఉచిత అమెజాన్ ప్రైమ్ ప్లాన్
జియో రూ.1,029 రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీనిలో 2GB రోజువారీ డేటా అందుబాటులో ఉంది. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాల్స్ చేయవచ్చు. రోజుకు 100 SMS పంపవచ్చు. వినియోగదారులు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాన్ని పొందొచ్చు.
Vi ఉచిత అమెజాన్ ప్రైమ్ ప్లాన్
Vi రూ.996 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. దీనిలో అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMS పంపవచ్చు. ఈ 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాన్ని ఆనందించవచ్చు. మరో Vi రూ.3,799 వార్షిక ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది ఇతర ప్రయోజనాలతో పాటు సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.


