Wednesday, January 22, 2025
Homeటెక్ ప్లస్Airtel: యూజర్లకు ఎయిర్‌టెల్‌ మరో షాక్

Airtel: యూజర్లకు ఎయిర్‌టెల్‌ మరో షాక్

యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే టారిఫ్ రేట్లు పెంచిన కంపెనీలు తాజాగా రీఛార్జ్ ప్లాన్లపై ఇచ్చే డేటాను తొలగిస్తున్నాయి. ముందుగా భారతీ ఎయిర్‌టెల్(Airtel) సంస్థ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జియో(JIO) కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

ఇక నుంచి 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.509 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, 900 ఎస్సెమ్మెస్‌లు మాత్రమే లభిస్తాయి. ఇక 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.1,999 రీఛార్జి ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ రెండు రీఛార్జి ప్లాన్లపై ఇంతకు ముందు డేటా కూడా అందించేది. తాజాగా డేటా సదుపాయాన్ని తొలగించింది. వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ట్రాయ్‌(TRAI) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కాగా ప్రస్తుతం వాయిస్‌, ఎస్సెమ్మెస్‌తో పాటు డేటా కలగలిపిన ప్లాన్‌లు టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో డేటా లేకుండా వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్లాన్లు తీసుకురావాలని ట్రాయ్‌ ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News