Friday, February 13, 2026
Homeటెక్నాలజీApple Fitness+: డిసెంబర్ 15 నుంచి ఇండియాలో ఆపిల్ ఫిట్‌నెస్+ సేవలు..కేవలం రూ. 149కే యోగా,...

Apple Fitness+: డిసెంబర్ 15 నుంచి ఇండియాలో ఆపిల్ ఫిట్‌నెస్+ సేవలు..కేవలం రూ. 149కే యోగా, డ్యాన్స్, మెడిటేషన్ క్లాసులు..

Apple Fitness+ Sevices Price, Features: గ్లోబల్ టెక్ దిగ్గజం అయిన ఆపిల్ తన హెల్త్ అండ్ వెల్‌నెస్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఆపిల్ ఫిట్‌నెస్+ను ఈ నెల మధ్యలో ఇండియాలో ప్రారంభించనట్లు ప్రకటించింది. టెక్ కంపెనీ అందించే ఈ సేవ ట్రైనర్-గైడెడ్ వర్కౌట్ వీడియోలు, రియల్-టైమ్ మెట్రిక్స్ ట్రాకింగ్, లక్ష్యాలను సాధించినందుకు రివార్డుల ద్వారా వినియోగదారులు ఫిట్‌నెస్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఆపిల్ ఫిట్‌నెస్+ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 49 దేశాలలో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

డిసెంబర్ 15న ఇండియాలో

డిసెంబర్ 15న భారతదేశంలో ఫిట్‌నెస్+ ప్రారంభమవుతుందని ఆపిల్ చెబుతోంది. మొదట్లో ఈ సేవ కేవలం ఆరు దేశాలలో మాత్రమే ప్రారంభమైన ఈ సేవ తరువాత 21 దేశాలకు విస్తరించగా, ఇప్పుడు మరిన్ని దేశాలకు చేరుకుంటుంది.

also read:OnePlus Pad Go 2: 10,050mAh బ్యాటరీతో వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 విడుదలకు సిద్ధం.. లాంచ్ తేదీ ఇదే!

ఇండియాలో ఆపిల్ ఫిట్‌నెస్+ సబ్‌స్క్రిప్షన్ ధరలు

ఆపిల్ ఫిట్‌నెస్+ భారతదేశంలో రెండు ప్లాన్‌లను కలిగి ఉంటుంది. నెలవారీ ప్లాన్ ధర రూ.149 ఉండగా, వార్షిక ప్లాన్ ధర మాత్రం రూ.999గా ఉంటుంది. ఇంకా, ఈ సబ్‌స్క్రిప్షన్ ఫ్యామిలీ షేరింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అంటే..ఒకే ప్లాన్‌ను 6 మంది కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు.

 

3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్

కొత్త ఆపిల్ వాచ్, ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీ, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లేదా పవర్‌బీట్స్ ప్రో 2 కొనుగోలు చేసే వినియోగదారులు 3 నెలల ఆపిల్ ఫిట్‌నెస్+ ఉచితంగా పొందుతారని కంపెనీ చెబుతోంది, పరికరం తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌కు మద్దతు ఇస్తే ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

also read:Jolla Phone: ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా విడుదలైన కొత్త జోల్లా ఫోన్!

ఈ దేశాలలో కూడా లాంచ్

ఆపిల్ ఫిట్‌నెస్+ డిసెంబర్ 15న భారతదేశంలోనే కాకుండా చిలీ, హాంకాంగ్, నెదర్లాండ్స్, నార్వే, ఫిలిప్పీన్స్, పోలాండ్, సింగపూర్, స్వీడన్, తైవాన్, వియత్నాం, 17 ఇతర దేశాలలో కూడా లాంచ్ కానుంది.

 

ఆపిల్ ఫిట్‌నెస్+ ఎందుకు ప్రత్యేకమైనది?

ఆపిల్ ఫిట్‌నెస్+ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే? ఇది స్ట్రెంగ్త్, యోగా, HIIT, పైలేట్స్, డ్యాన్స్, సైక్లింగ్, కిక్‌బాక్సింగ్, ధ్యానంతో సహా 12 కంటే ఎక్కువ వ్యాయామ వర్గాలను అందిస్తుంది. ఇది దాదాపు 5 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు వ్యాయామ వీడియోలను అందిస్తుంది. వినియోగదారులు ఆపిల్ వాచ్ లేదా ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని ఉపయోగిస్తుంటే వారు హార్ట్ బీట్ రేట్, బర్న్ అయిన కేలరీలు, యాక్టివిటీ రింగ్‌లు వంటి రియల్-టైమ్ మెట్రిక్‌లను ట్రాక్ చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News