iPhone 16e Price Cut: దేశంలో పండగ సీజన్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా చాలామంది కొత్త వస్తువులను కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో మీరు కూడా ఈ దీపావళికి కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తూ ప్లాన్ చేస్తుంటే, మీకో గుడ్ న్యూస్! ప్రస్తుతం ఐఫోన్ 16e అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో కాకుండా రిలయన్స్ డిజిటల్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. అంటే మీరు ఈ పరికరాన్ని దాని అత్యల్ప ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ పరికరం రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో రూ.9,900 కంటే ఎక్కువ తగ్గింపుతో లిస్ట్ అయింది. కాబట్టి, ప్రస్తుత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేవారికి, ఈ డీల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఐఫోన్ 16e ఆఫర్ గురించి మరింత తెలుసుకుందాం.
డిస్కౌంట్
ఆపిల్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఐఫోన్ 16eని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ పరికరాన్ని ఇండియాలో రూ.59,900 ప్రారంభ ధరకు విడుదల చేశారు. అయితే, దీపావళికి ముందు, ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం రూ.49,990కి అందుబాటులో ఉంది. అంటే..రిటైలర్ ఐఫోన్ 16e పై ఏకంగా రూ.9,910 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఫీచర్లు
ఆపిల్ ఐఫోన్ 16e ఫీచర్ల విషయానికి వస్తే, ఈ పరికరం 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ పరికరం అల్యూమినియం డిజైన్, ఫేస్ ID మద్దతును కలిగి ఉంది. అదనంగా, ఐఫోన్ 16e ఆపిల్ శక్తివంతమైన A18 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా గురించి చెప్పాలంటే పరికరం 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ముఖ్యంగా ఐఫోన్ 16e ఇమేజ్ క్లీనప్ టూల్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, చాట్ జిపిటి ఇంటిగ్రేషన్‌తో సహా ప్రత్యేక ఏఐ లక్షణాలను కూడా అందిస్తుంది. అదనంగా, ఈ పరికరం USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


