Saturday, November 15, 2025
Homeటెక్నాలజీIphone 17 Series: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్.. ఆపిల్ చరిత్రలో అతి సన్నని...

Iphone 17 Series: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్.. ఆపిల్ చరిత్రలో అతి సన్నని మొబైల్ ఇదే..

Iphone 17 Series Launched: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆపిల్ ఈవెంట్ 2025 ముగిసింది. మంగళవారం రాత్రి నిర్వహించిన ఈ ఈవెంట్ లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 4 మోడళ్లు లాంచ్ అయ్యాయి. స్టాండర్డ్ మోడల్ ఐఫోన్ 17 తో పాటు, అల్ట్రా-స్లిమ్ ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్. అయితే కంపెనీ ప్లస్ మోడల్‌ను నిలిపివేసి, దానిని ఎయిర్ మోడల్‌తో భర్తీ చేసింది. వీటితో పాటున్యూజనరేషన్ ఎయిర్ పోడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11, ఎస్ఈ3 వాచ్ ను కంపెనీ లాంచ్ చేసింది.

- Advertisement -

ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల లో పలు ఏఐ, అధునాత ఫీచర్లను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఫోన్లన్నీ ios 16 ఆధారణగా పనిచేయనున్నాయి. అని ఫోన్లలో 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్ నెస్ అందించారు. ఐఫోన్ 17 సిరీస్ బేస్ స్టోరేజీ 256 జీబీగా ఉంది. గత ఐఫోన్ల తో పోలిస్తే వీటిలో ఉత్తమ బ్యాటరీ బ్యాకప్ ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిని సెప్టెంబర్ 12 నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇక అమ్మకాలు సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమవుతాయి.

ఐఫోన్ 17: ఫీచర్లు, ధర

ఈ ఫోన్ 6.3-అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్ నెస్ అందించారు. అల్యూమినియం, గ్లాస్ ఫినిషింగ్‌తో ఉన్న ఈ మోడల్ 7.3mm మందంతో ఉంటుంది. దీనికి ఆపిల్ తాజా A19 చిప్ ఇచ్చారు. ఇది 8GB RAMతో జత చేయబడింది. దీనికి వెనుక భాగంలో 48MP + 12MP డ్యూయల్ కెమెరా సెటప్ కెమెరా ఉంది. ఐఫోన్ 17 ముందు భాగంలో సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. లావెండర్, మిస్ట్ బ్లాక్, వైట్, సెజ్ రంగుల్లో లభిస్తోంది. కాగా, ఇండియాలో ఐఫోన్ 17 256 జీబీ వేరియంట్ ధర రూ.82,900గా నిర్ణయించారు.

Also Read:iPhone-17 : ఆపిల్ నుంచి ‘ఐఫోన్ ఎయిర్’ అద్భుతం… అత్యంత సన్నని ఐఫోన్ ఇదే!

ఐఫోన్ ఎయిర్: ఫీచర్లు, ధర

అత్యంత నాజుగా ఐఫోన్ ఎయిర్ ను కంపెనీ లాంచ్ చేసింది. దీని మందం 5.6mm. ఇది సిరామిక్ షీల్డ్‌తో వస్తుంది. దీని ఫ్రేమ్ టైటానియంతో తయారు చేశారు. కాగా, స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్,స్కై బ్లూ వంటి నాలుగు రంగుల ఎంపికలలో లభిస్తుంది. ఇది A19 ప్రో చిప్‌సెట్‌తో అమర్చారు. ఇది ఇప్పటివరకు అత్యంత శక్తి-సమర్థవంతమైన ఐఫోన్ అవుతుందని కంపెనీ చెబుతోంది. దీనికి వెనుక భాగంలో 48MP ఫ్యూజన్ కెమెరా, ముందు భాగంలో 18MP సెంటర్ స్టేజ్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 17 ఎయిర్ 256 జీబీ వేరియంట్ ధర రూ.1,19,900.

ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు, ధర:

ఈసారి ఆపిల్ ప్రో మోడల్‌ను కొత్త వెనుక లుక్‌తో విడుదల చేసింది. ఇది ప్రమోషన్ టెక్నాలజీ, ఎల్లప్పుడూ ఆన్-డిస్ప్లే మద్దతుతో 6.3-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. యాంటీ-రిఫ్లెక్టివ్ డిస్ప్లేతో ఉన్న ఈ ఫోన్ అల్యూమినియం, గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీని మందం 8.7mm. దీని A19 ప్రో చిప్‌సెట్ 12GB RAMతో జత చేయబడింది. ఇది ఆవిరి చాంబర్ కూలింగ్‌తో తీసుకొచ్చారు. ఇది సిల్వర్, డీప్ బ్లూ, కాస్మిక్ ఆరంజ్ రంగులలో ఇది లభిస్తోంది. కెమెరా గురించి చెప్పాలంటే, వెనుక భాగంలో 48MP+48MP+48MP ట్రిపుల్ సెటప్, ముందు భాగంలో 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది 8K వీడియో రికార్డింగ్‌తో పాటు డ్యూయల్ కెమెరా రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ వేరియంట్ ధర రూ.1,34,900గా నిర్ణయించారు.

ఐఫోన్ 17 ప్రో మాక్స్: ఫీచర్లు, ధర

దీని బ్యాటరీ, డిస్ప్లే కాకుండా, అన్ని ఇతర ఫీచర్లు ప్రో మోడల్‌ మాదిరిగానే ఉంటాయి. ఈ సిరీస్‌లోని ఈ ఫ్లాగ్‌షిప్ పరికరం 6.9-అంగుళాల ఆల్వేస్-ఆన్, యాంటీ-రిఫ్లెక్టివ్, ప్రమోషన్ టెక్నాలజీ డిస్ప్లేతో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో అల్యూమినియం, గ్లాస్ ఫినిషింగ్, A19 Pro చిప్‌సెట్, వేపర్ చాంబర్ కూలింగ్ కూడా ఉన్నాయి. గత ఫోన్లలో కంటే అతి పెద్ద బ్యాటరీ కెపాసిటీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ.1,49,900.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad