Monday, March 16, 2026
Homeటెక్నాలజీApple March 2026 Launch: ఐఫోన్ 17e ధర లీక్.. ఈ రేంజ్‌లో వస్తే మార్కెట్...

Apple March 2026 Launch: ఐఫోన్ 17e ధర లీక్.. ఈ రేంజ్‌లో వస్తే మార్కెట్ మొత్తం షేక్ అవ్వాల్సిందే

Apple March 2026 Launch: ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల వరకు, చాలా మందిలో ఒకసారి అయినా ఐఫోన్ వాడాలని కోరిక కలిగిందే ఉంటుంది. ప్రీమియం లుక్, స్మూత్ పర్‌ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరా, బ్రాండ్ విలువ, ఇవన్నీ కలిసొచ్చే ఫీల్ ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి ఐఫోన్ ఇప్పుడు కొంచెం తక్కువ ధరలో అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అదే నేపథ్యంలో, ఈరోజు మార్చి 2, 2026 నుంచి ఆపిల్ లాంచ్ వీక్ అధికారికంగా ప్రారంభమైంది. ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ముందే ప్రకటించినట్టుగా ఈసారి ఒకే రోజు కాకుండా, వారం మొత్తం కొత్త మోడళ్లను ప్రకటించే ప్లాన్ ఉంది. అందులో మొదటి ఫోకస్ ఐఫోన్ 17ఇ మీదే ఉంది.

- Advertisement -

తక్కువ ధరలో ఐఫోన్ అనుభవం

ఐఫోన్ 17ఇ ఎంట్రీ లెవల్ ఫోన్ అయినప్పటికీ, ఈసారి స్పెసిఫికేషన్ విషయంలో పెద్ద రాజీ పడకపోవచ్చని సమాచారం. కొత్త జనరేషన్ చిప్ తో స్పీడ్ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. యాప్స్ వేగంగా ఓపెన్ అవ్వడం, మల్టీటాస్కింగ్ స్మూత్ గా సాగడం, గేమింగ్ లో స్థిరమైన పర్‌ఫార్మెన్స్ ఇవ్వడం వంటి అంశాల్లో ఇది మంచి అనుభవం ఇవ్వొచ్చు. రోజువారీ వాడకంలో ల్యాగ్ లేకుండా పనిచేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

డిజైన్, డిస్‌ప్లే వివరాలు.

డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, అప్‌డేటెడ్ లుక్ ఇవ్వొచ్చు. ఫ్రంట్ లో నాచ్ కొనసాగవచ్చు. ఫేస్ ఐడి సపోర్ట్ అలాగే ఉంటుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పెరిగి, అవుట్‌డోర్ లో కూడా స్పష్టంగా కనిపించేలా ఉండే అవకాశం ఉంది. కలర్స్ విషయంలో కూడా కొత్త ఆప్షన్స్ రావచ్చు.

కెమెరా అప్‌గ్రేడ్ ఏమిటి

కెమెరా విషయంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. నైట్ ఫోటోలు క్లియర్ గా రావడం, తక్కువ లైట్ లో కూడా క్లియర్ గా ఫోటోలు రావడం, వీడియో తీసేటప్పుడు షేక్ తగ్గి, ఫుటేజ్ స్థిరంగా, స్మూత్ గా నమోదయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియా కోసం కంటెంట్ క్రియేట్ చేసే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.

Read Also: Motorola Razr Fold: అబ్బా.. ఆ స్క్రీన్ సైజ్ ఏంటి సామీ.. 8.1 ఇంచుల డిస్‌ప్లేతో కొత్త మోటరోలా ఫోన్ వివరాలివే

బ్యాటరీ, ఛార్జింగ్ ఎలా ఉండొచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో 1 పూర్తి రోజు పనిచేసేలా ఉండే అవకాశం ఉందని సమాచారం. పవర్ వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి.

ఇండియా ధర ఎంత ఉండొచ్చు.

ఇండియా మార్కెట్ లో ఐఫోన్ 17ఇ ప్రారంభ ధర సుమారు రూ.49,900గా ఉండే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. 128 జీబీ వేరియంట్ ఈ ధరలో అందుబాటులోకి రావచ్చని సమాచారం. 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.59,900వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధర స్థాయిలో ఒక కొత్త ఐఫోన్ అందుబాటులోకి వస్తే, మార్కెట్ లో మంచి స్పందన లభించే అవకాశం ఉంది. లాంచ్ వీక్ లో జరిగే అధికారిక ప్రకటనల అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News