Homeటెక్నాలజీApple Phone: యాపిల్ నుంచి ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌.. ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే గురూ..

Apple Phone: యాపిల్ నుంచి ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌.. ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే గురూ..

Apple first foldable phone features: ఆపిల్‌ ఐఫోన్లకు మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీమియం సెగ్మెంట్‌లో లభించే ఈ ఫోన్లు విడుదలైన గంటల్లోనే హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి. అంతటి క్రేజ్‌ గల యాపిల్‌ సంస్థ.. తాజాగా కొత్త సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. తన తొలి ఫోల్డెబుల్‌ ఫోన్‌ విడుదలకు సిద్ధమవుతోంది.ఇప్పటికే ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ యాన్యువల్ ఈవెంట్‌ తేదీని ప్రకటించింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో సెప్టెంబర్ 9న సర్ప్రైజ్ అండ్ షైన్ అనే టాగ్ లైన్‌తో ఈవెంట్‌ నిర్వహించనుంది. ప్రతి ఏటా కొత్త ఐఫోన్‌ సిరీస్‌లను ఆవిష్కరించే ఆపిల్ సంస్థ.. ఈసారి సరికొత్తగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను పరిచయం చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో టెక్‌ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఫోల్డబుల్ ఐఫోన్ ఫీచర్లు ఇవే..

ఇక, ఫీచర్ల విషయానికి వస్తే.. బుక్ స్టైల్ మోడల్‌లో రానున్న ఈ ఫోన్ లోపలి డిస్‌ప్లే 5.5 అంగుళాల ఉండనుంది. అన్‌ఫోల్డ్ చేస్తే దాదాపు 7.8 అంగుళాల ఐప్యాడ్ మినీ సైజ్ స్క్రీన్‌ విడ్త్‌లో ఉండనుంది. అదేవిధంగా, ఫోన్ అన్‌ఫోల్డ్ చేసినప్పుడు కేవలం 4.5 మి.మీ మందంతో అత్యంత సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. సైడ్ బటన్‌లో టచ్ ఐడీ, వెనుక వైపు డ్యూయల్ 48 ఎంపీ కెమెరాలు రానున్నాయి. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర 2 వేల డాలర్లను నుంచి 2,500 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.70 లక్షల నుంచి రూ.2.10 లక్షల కంటే ఎక్కువ ఉండే ఛాన్స్‌ ఉంది. సెప్టెంబర్ 1న టామ్ కుక్ నుంచి యాపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న జాన్ టెర్నస్ నాయకత్వంలో జరుగుతున్న మొదటి ప్రాడక్ట్ లాంచింగ్‌ ఈవెంట్ ఇదే కావడం విశేషం.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News