Ather 450S Launched: మార్కెట్లో ఎలెక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. దీంతో అనేక కంపెనీ తయారీదారులు మార్కెట్లోకి కొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈ కోవలో ఏథర్ ఎనర్జీ తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ 450S కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు బిగ్ బ్యాటరీ, ఎక్కువ రేంజ్‌తో వస్తుంది. లాంగ్-రేంజ్, స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ ఒక గొప్ప ఎంపిక.
Ather 450S పనితీరు:
ఏథర్ 450S పనితీరు మునుపటిలాగే ఉంది. ఇందులో ఇప్పటికీ 22Nm టార్క్ ఉత్పత్తి చేసే 5.4kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 సెకన్లలో 0 నుండి 40 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. గరిష్టంగా 90kph వేగాన్ని అందుకుంటుంది. అయితే, ఇందులో స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్ అనే నాలుగు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.
Ather 450S డిజైన్, ఫీచర్లు:
ఏథర్ 450Sకి కేవలం బ్యాటరీ అప్‌డేట్ ఇచ్చారు. మిగతా డిజైన్, ఫీచర్లు మునుపటి మోడల్ తరహా లాగానే ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూలెటర్ లో మునుపటిలాగే 7-అంగుళాల LCD డాష్‌ను కలిగి ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, హిల్-హోల్డ్, ఫాల్ సేఫ్, ఈథర్‌స్టాక్ OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్ట్ ఇస్తుంది.
Also Read: Piaggio Electric Auto: పియాజియో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు..ధరెంతో తెలుసా..?
Ather 450S లో కొత్తగా ఏముంది?:
కొత్తగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బిగ్ బ్యాటరీ ప్యాక్, ఎక్కువ రేంజ్ పరిధితో తీసుకొచ్చారు. ఇది బిగ్ 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. అయితే, మునుపటి మోడల్ లో ఈ బ్యాటరీ 450Xలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక ఈ అప్‌గ్రేడ్‌తో ఏథర్ 450S ఎలెక్ట్రిక్ స్కూటర్ IDC-సర్టిఫైడ్ పరిధి 115 కి.మీ నుండి 161 కి.మీకి ఇస్తుంది. సుదూర ప్రయాణాలు చేసేవారికి ఇది ఒక గొప్ప ఎంపిక.
Ather 450S ధర:
కొత్త వేరియంట్ ఏథర్ 450S ఎలెక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.46 లక్షలు. ఇది దీని మునుపటి మోడల్ కంటే రూ. 16,000 ఎక్కువ. కంపెనీ కొనుగోలుదారులకు బ్యాటరీని 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ. వారంటీని అందిస్తోంది. డెలివరీలు ఆగస్టు 2025లో ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు కోసం ఆన్‌లైన్ లేదా సమీపంలో ఉన్న Ather డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు.


