Monday, June 23, 2025
Homeటెక్నాలజీAudi Q7 Signature Edition: ఏడు కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఆడి కొత్త కారు..ధరెంతో తెలుసా..?

Audi Q7 Signature Edition: ఏడు కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఆడి కొత్త కారు..ధరెంతో తెలుసా..?

Audi Q7 Signature Edition Launched: భారత మార్కెట్లో తక్కువ ధర కార్లతో పాటు ప్రీమియం, ఖరీదైన కార్లకు కూడా చాలా డిమాండ్ ఉంది. యూరప్‌లోని ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఆడి భారతదేశంలో Q7 SUV ప్రత్యేక ఎడిషన్ (ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్ లాంచ్)ను విడుదల చేసింది. కంపెనీ దీనిలో శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు అనేక గొప్ప ఫీచర్లను అందించింది. దీనితో పాటు కొత్త ఎడిషన్‌లో ఏడు కొత్త ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. అయితే, ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్‌ ఫీచర్లు, ధర గురుంచి ఇక్కడ తెలుసుకుందాం.


ఫీచర్లు

ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్‌లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దీనిలో ఆడి లోగోకు LED లైట్లతో వస్తోంది. అంతేకాకుండా..ఈ కారులో మెరుగైన అనుభవం కోసం డైనమిక్ వీల్ హామ్ క్యాప్, మెటాలిక్ కీ కవర్, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్, ఎస్ప్రెస్సో మొబైల్ కాఫీ సిస్టమ్, ఆడి యూనివర్సల్ ట్రాఫిక్ రికార్డర్‌తో కూడిన ఆడి డాష్‌క్యామ్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై ప్రత్యేక పెయింట్ డిజైన్ వంటి కొత్త ఫీచర్ల ను అందించారు.

Q7 సిగ్నేచర్ ఎడిషన్‌లో ఏడు డ్రైవింగ్ మోడ్‌లు, ఎయిర్ సస్పెన్షన్, 19 స్పీకర్లతో కూడిన బ్యాంగ్ & ఓలుఫ్సెన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా, నాలుగు జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, ESP వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజన్

ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్‌ మూడు లీటర్ V6 ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని కారణంగా ఇది 340 హార్స్‌పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా దీనికి అందించారు. ఈ ఇంజిన్‌తో దాదాపు 5.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 250 kmph వరకు ఉంటుంది.

ధర

ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 99.81 లక్షలుగా నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News