Saturday, November 15, 2025
Homeటెక్నాలజీAirplane Mode: ఎయిర్‌ప్లేన్ మోడ్‌తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Airplane Mode: ఎయిర్‌ప్లేన్ మోడ్‌తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Airplane Mode Uses:  మనంలో చాలామంది ఏదో ఒక సందర్భంలో  ఫోన్‌ ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించి ఉండే ఉంటారు. అయితే, చాలా మంది ఈ ఫీచర్ విమానాల ప్రయాణ సమయంలో నెట్‌వర్క్‌ను నిలిపివేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుందని అనుకుంటారు. కానీ, నిజం ఏమిటంటే? మీరు దీన్ని మీ దైనందిన జీవితంలో అనేక స్మార్ట్ మార్గాల్లో ఉపయోగించవచ్చు. ఈ ఎయిర్‌ప్లేన్ మోడ్‌ ఫీచర్‌తో ఫోన్ బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా, పరికరాన్ని వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒక్కటే కాదు, అనేక ఇతర మార్గాల్లో కూడా దీని ప్రయోజనాలను పొందవచ్చు.ఈ క్రమంలో ఎయిర్‌ప్లేన్ మోడ్ వల్ల కలిగే  అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బ్యాటరీ వినియోగం తగ్గుతుంది: మీరు వీక్ నెట్‌వర్క్ సిగ్నల్ ఉన్న ప్రాంతంలో ఉంటే, ఫోన్ నిరంతరం నెట్‌వర్క్‌ల కోసం సెర్చ్ చేస్తుంది. దీంతో బ్యాటరీని వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఫోన్‌కు విరామం ఇవ్వడానికి ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. ఇది నెట్‌వర్క్‌ల కోసం సెర్చ్ చేయకుండా ఫోన్‌లో గణనీయమైన మొత్తంలో బ్యాటరీని ఆదా చేస్తుంది.
ఫోన్ వేడెక్కడం నుండి రక్షించండి: కొన్నిసార్లు, పేలవమైన నెట్‌వర్క్ కవరేజ్ లేదా అధిక బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ మొబైల్ ఫోన్‌లు త్వరగా వేడెక్కేలా చేస్తాయి. ఇటువంటి పరిస్థితులలో ఫోన్‌ను చల్లబరచడానికి ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. ఇది నెట్‌వర్క్ కనెక్టివిటీని నిలిపివేస్తుంది.  ప్రాసెసర్‌పై పనిభారాన్ని తగ్గిస్తుంది. ఫోన్ వేగంగా చల్లబరుస్తుంది.
ఫోకస్ పెంచుతుంది: ఎయిర్‌ప్లేన్ మోడ్ బ్యాటరీని ఆదా చేయడానికి మాత్రమే కాదు, ఇది  దృష్టి పెట్టడానికి కూడా సహాయపడుతుంది. నిరంతరం నోటిఫికేషన్‌లు, కాల్స్, సందేశాలు దృష్టి మరల్చవచ్చు. అలాగే ఏదైనా జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే లేదా ఒక ముఖమైన పని చేస్తుంటే దానిపై దృష్టి కేంద్రీకరించడం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితులలో కాల్‌లు లేదా నోటిఫికేషన్‌లను నిరోధించడానికి ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించవచ్చు.
ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది: ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఉపయోగించడం ద్వారా మొబైల్ ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ మోడ్‌ను ఆన్ చేయడం వల్ల మీ ఫోన్‌లోని నెట్‌వర్క్, Wi-Fi, బ్లూటూత్ వంటి కార్యకలాపాలు ఆఫ్ అవుతాయి. ఇది ఛార్జింగ్ సమయంలో పరికరంపై పనిభారాన్ని తగ్గించి, బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది. అయితే, ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వని ఫోన్‌లు ఇప్పటికీ తమ ఫోన్‌లను వేగంగా ఛార్జ్ చేయడానికి ఈ మోడ్‌ను ఉపయోగించవచ్చు.
పిల్లలను ఇంటర్నెట్ నుండి దూరంగా:  పిల్లలు తరచుగా ఫోన్‌లో గేమ్స్ అడగలిగేలా, వారికీ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయకూడదని కోరుకుంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. ఈ మోడ్ ఎటువంటి ప్రకటనలను చూడకుండా నిరోధిస్తుంది.  తద్వారా వారు గేమ్స్ ను సురక్షితంగా, అంతరాయాలు లేకుండా ఆస్వాదించవచ్చు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad