Thursday, July 10, 2025
Homeటెక్నాలజీMobiles under 12K: కొత్త ఫోన్ కొనాలా? రూ.12 వేల కంటే తక్కువ బడ్జెట్ లో...

Mobiles under 12K: కొత్త ఫోన్ కొనాలా? రూ.12 వేల కంటే తక్కువ బడ్జెట్ లో మోటరోలా ఫోన్లు..

Mobiles under 12K: మోటరోలా తమ వినియోగదారులకు సరసమైన ధరకు అదిరిపోయే ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. ఒకవేళ తక్కువ బడ్జెట్‌లో కూల్ మోటరోలా ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే కేవలం రూ.12 వేల రూపాయల లోపు ధరకు లభించే మూడు బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లలో రెండు 5G కనెక్టివిటీని అందిస్తాయి. ఈ జాబితాలోని మోటరోలా చౌకైన ఫోన్ ధర కేవలం రూ.7950 మాత్రమే. కాగా, ఈ మూడు ఫోన్‌లు 50 మెగాపిక్సెల్‌ల వరకు ప్రధాన కెమెరాతో రావడం విశేషం.

- Advertisement -

Motorola G05 4G

ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. 4జీబీ+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. ఈ Motorola ఫోన్ MediaTek Helio G81 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మోటరోలా G05 4Gలో ఫోటోగ్రఫీ కోసం..50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఫోన్ బ్యాటరీ 5200mAh. ఫోన్‌లో డాల్బీ అట్మోస్ ఆడియో కూడా అందించారు. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో కేవలం రూ. 7,950 ధరకు లభిస్తోంది.

Motorola G35 5G

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.72 అంగుళాల పూర్తి HD + డిస్‌ప్లేను ఉంది. 4జీబీ+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 10,349కి అందుబాటులో ఉంది. మోటరోలా G35 5G స్మార్ట్ ఫోన్ Unisoc T760 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ పరికరం 5000mAh బ్యాటరీ తో 18 వాట్ల ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Motorola G45 5G

ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది. 8జీబీ+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 11,748 ధరకు లభిస్తుంది. మోటరోలా G45 5G స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీని బ్యాటరీ 5000mAh. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ ఆడియోతో వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News